Monday, 24 November 2025

అలా కనిపించాల్సిన అవసరం లేదు...


చాలా గ్యాప్ తర్వాత ఇవ్వాళ నాకు కాల్ చేసిన ఒక ఫ్రెండ్ అంటాడు, "నువ్వెప్పుడూ కూల్‌గా, కామ్‌గా ఉంటావు. అసలు రిస్కులు తీసుకోవు, టెన్షన్స్ పెట్టుకోవు" అని.

నిజానికి, నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అందరిలోనూ రిస్కులు తీసుకునేది నేనొక్కన్నే.

నేను తీసుకున్నంత రేంజ్‌లో ఏ ఒక్కరూ-ఐ రిపీట్-ఏ ఒక్కరు కూడా రిస్కులు తీసుకోలేదు. తీసుకోలేరు. 

ఇది గొప్ప విషయంగా నేను చెప్పుకోవటం లేదు. అలా జరిగింది. అంతే. 

సో, సహజంగానే... టెన్షన్స్ నాకే ఎక్కువ. 

కాని, అలా కనిపించాల్సిన అవసరం లేదు అని నేననుకుంటాను. అలా ఉంటాను. 

Tension is the mind’s noise. Choose calm, choose clarity, and keep walking. Life opens for the quiet soul.

- మనోహర్ చిమ్మని  

When No One Is Watching


The world sees our performance.
But the universe watches our truth.

In the quiet corners of the day,
when no eyes are on us
and no applause is waiting,
a different self rises—
the unpolished, uncrowded, honest self.

That is the real you.

The way you speak to your own thoughts.
The choices you make with no witness.
The promises you keep only to your soul.
This is your true vibration,
your inner signature.

Spirituality lives here—
not in the noise,
but in the secret moments
where you stand face to face
with your own light and your own shadows.

If you want to rise,
clean this private room.
Strengthen this silent self.

Because who you are
when no one is watching
is the seed
from which your entire life grows.

- Manohar Chimmani 

కవర్ సాంగ్స్ ప్రియుల కోసం!


Dear New Singers & Instrumentalists!

Hi.

తెలుగు, హిందీ భాషల్లో బాగా హిట్ అయిన, పాపులర్ అయిన...

మెలొడీస్ (ఉదా: "సయ్యారా" సాంగ్), 
ఐటెం నంబర్స్, 
ఫాస్ట్ బీట్స్, 
ఫోక్,
ఇతర పాపులర్ సాంగ్స్‌కు 
"కవర్ సాంగ్స్" పాడి నాకు పంపించండి.

మీరు పాడుతున్న వీడియో రికార్డ్ పంపిస్తే బెటర్. 
నా యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేస్తాను.  

వాయిద్యకారులు కూడా కూడా... గిటార్, ఫ్లూట్, వయొలిన్, కీబోర్డ్ మొదలైనవాటిపైన వీడియో రికార్డ్ చేసి నాకు పంపండి. నా యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేస్తాను.    

నాకు పర్సనల్‌గా బాగా నచ్చిన పాటల పైన, ఆర్టిస్టుల గురించి నా బ్లాగ్‌లో రాస్తాను. నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. 

నా చానెల్లో అప్‌లోడ్ చెయ్యడానికి మీకు ఎలాంటి అభ్యంతరం మీకు ఉండకూడదు. ఇంతకు ముందు ఎవరికైనా పంపించినవి కాని, లేదా మీరే అప్‌లోడ్ చేసినవి కాని నాకు పంపించవద్దు. 

Please send me only your fresh recordings.

We never know which small step can lead to a bigger opportunity. Let’s explore different ways to find what’s best for the team. 

Send your cover song video recordings to:
Email: okafilmmaker@gmail.com
WhatsApp (text only): +91 99895 78125
Strictly no calls, please. 

- Manohar Chimmani 
Film Director, Nandi Award Winning Writer, Blogger 

Saturday, 22 November 2025

The Other Side of Creativity


Every coin has two sides. And when it comes to creativity, the flip side is spirituality.

We often think of creativity as an outward act — making, expressing, shaping something new. But look closer. Creativity is just another pathway inward. The same energy that drives us to paint, write, compose, direct, or build… also pulls us toward silence, stillness, and meaning.

Both creativity and spirituality lead us to the same destination: happiness, mental peace, anandam. One through expression, the other through introspection.

This is why every truly creative person, at some point, begins to love the quiet pull of spirituality. Not as an escape, but as a recharge. Not as a rulebook, but as a return to the source.

In the end, creativity takes us out into the world —
and spirituality brings us back home.

- Manohar Chimmani 

Friday, 21 November 2025

ఫస్ట్రేషన్లో పొరపాట్లు జరుగుతాయి. కాని...


ఒకవైపు అన్ని వేల మంది ముందు ప్రత్యక్షంగా, మరోవైపు కోట్ల మంది ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా లైవ్ చూస్తున్నారని తెలిసీ... ఫస్ట్రేషన్లో మరీ అంత కంట్రోల్ తప్పి, అంత కేర్‌లెస్‌గా రాజమౌళి మాట్లాడ్డం నిజంగా ఊహించనిది.

ఫస్ట్రేషన్లో పొరపాట్లు జరుగుతాయి. అది సెన్సిటివ్ విషయాల మీద అయినప్పుడు సింపుల్‌గా ఒక క్షమాపణ చెప్పేస్తే పోయేదేం లేదు. రాజమౌళి కూడా మామూలు మనిషే కాబట్టి, మామూలుగా ఒక చిన్న "చింతిస్తున్నాను" మెసేజ్ పెడితే అయిపోతుంది కదా?!  

కట్ చేస్తే - 

రాజమౌళి "నాస్తికుడు" కావడం అతని ఇష్టం. దానికి ఎవ్వరి అభ్యంతరం ఉండదు, ఉండకూడదు. దీనికోసం పక్కనెవరో ఇంకో డైరెక్టర్ రాజ్యాంగంలోని ఆర్టికిల్ నంబర్ చెప్తూ డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు.     

కాని, క్షమాపణ చెప్పడానికి ఇంత ఈగో ఫీలయ్యే "దేవుళ్ళ మీద నమ్మకంలేని నాస్తిక" రాజమౌళి... అదే దేవుళ్ళ ప్రస్తావన, కథ, పాత్రలు లేని సినిమాలు చేసుకోవాలి.   

బాహుబలిలో శివలింగం ప్లేస్‌లో ఇంకోటి ఏదైనా పెట్టుకోవాల్సి ఉండే. ఇప్పుడు వారణాసి టైటిల్, అందులో రాముని పాత్ర, హనుమంతుడు... ఇవన్నీ వాడుకొంటూ నాస్తికుడు దేవుళ్ళతో బిజినెస్ చేసుకోవచ్చా? అక్కడ ఈగో అడ్డు రాదా? 

ఆస్తిక ప్రస్తావన లేకుండా నాస్తికుడు సబ్జెక్టులు తయారుచేసుకోలేడా?  

అది చాతకాకపోతే అలాగే చేసుకొని బ్రతకొచ్చు.

కాని, "మీ హనుమంతుడు ఏం చేశాడు" అని అంతమంది ముందు సొంత తండ్రి, సొంత భార్య నమ్మకాల్ని అలా ఎగతాళి చెయ్యటం ఏం బాగుంది? 

- మనోహర్ చిమ్మని  

PS:
ఇది అసూయ కాదు. హాలీవుడ్ స్థాయిలో అంత భారీ సినిమా చేస్తూ, ఒక చిన్న స్లిప్ ఆఫ్ ద టంగ్ పొరపాటుని పెద్ద సమస్య చేసుకోకపోతే బాగుంటుందని. అంతే.

PPS: 
నిజమైన ఫ్రెండ్స్ అయితే నాలా "ఒక సారీ చెప్పెయ్, అయిపోతుంది" అని సలహా ఇస్తారు. ఇంకా దీన్ని సాగదీయరు.        

Thursday, 20 November 2025

హాలీవుడ్ స్థాయి సినిమాల్ని తీయటం మంచిదే. కానీ...


ఈ డిజిటల్-ఏఐ-జెన్‌జీ-సోషల్‌మీడియా సునామీ యుగంలో - ప్రిరిలీజ్ లాంటి పరస్పరం డప్పులు కొట్టుకొనే రొటీన్ బోరింగ్ టైప్ ప్రమోషన్లు లేకుండా సినిమాకు హైప్ తీసుకురాలేమా? బిజినెస్ చెయ్యలేమా? రిలీజ్ చెయ్యలేమా? 

ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల డాలర్ల బిజినెస్ చేసుకునే ఒక్క హాలీవుడ్ సినిమాకు కూడా ఇప్పటివరకు ఇలాంటి ప్రమోషన్లు లేవు. 

సినిమా గురించి ట్రేడ్ ఎనౌన్స్‌మెంట్, స్టూడియో ప్రెస్ రిలీజ్, ఫైనల్ కాస్ట్ రివీల్, షార్ట్ వీడియో స్నిప్పెట్స్, బిహైండ్ ద సీన్ ఫోటోలు, ఫెస్టివల్స్‌లో ప్రీమియర్స్, బ్రాండ్ టై-అప్స్, మ్యాగజైన్ కవర్స్, ఆర్టికిల్స్, ఫ్యాన్ స్క్రీనింగ్స్, క్రిటిక్స్ స్క్రీనింగ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ స్క్రీనింగ్స్, నాలుగైదు షోల్లో ఇంటర్వ్యూలు, ప్రెస్‌ నోట్స్, రిలీజ్ న్యూస్, స్టాండర్డ్‌గా ఒక్క పోస్టర్, ఒక్క అఫీషియల్ ట్రయలర్. అంతే. 

అదీ హాలీవుడ్ సినిమా ప్రమోషన్, మార్కెటింగ్. 

ప్రమోషన్ బడ్జెట్ ఉంటుంది. అంతా డిజిటలైజ్డ్ ప్రమోషనే తప్ప, ఎక్కడా వేలాదిమందిని ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ చేసే కార్యక్రమాలుండవు. 

ఒక్కసారి ఏదైనా జరగరానిది జరిగితే, ప్రమాదం తీవ్రస్థాయిలో ఉంటుంది. ఎవ్వరూ దేన్నీ కంట్రోల్ చెయ్యలేరు. 

హాలీవుడ్ స్థాయి సినిమాల్ని తీయటం మంచిదే. ప్రమోషన్ విషయంలో కూడా హాలీవుడ్ స్థాయికి మనం ఎందుకు వెనకబడి ఉండాలి?   

కట్ చేస్తే -

మనదగ్గర ఒక్క టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌కే 30 కోట్ల ఖర్చు. ప్రత్యక్షంగా వేలాది మంది ఫ్యాన్స్‌తో ఈవెంట్లు. 

ఇంక రిలీజ్ వరకు ఎన్ని ఈవెంట్స్ ఉంటాయో, ఎంత ఖర్చవుతుందో ఊహించవచ్చు. 

ఈ ఖర్చుతోనే ఇంకో భారీ బడ్జెట్ సినిమా ఈజీగా తీయొచ్చు.

ఇలాంటి భారీ మార్కెటింగ్ జిమ్మిక్స్‌తో భారీగా బిజినెస్ చెయ్యొచ్చు, భారీగా లాభాలు పొందొచ్చు. భారీగా రెమ్యూనరేషన్స్ పెంచుకోవచ్చు. వీటన్నిటి అంతిమ లక్ష్యం అదే కాబట్టి తప్పేం లేదు. 

కాని, తిరిగి తిరిగి ఈ ఖర్చు భారం సామాన్య ప్రేక్షకుడిపైన పడకూడదు. కాని, తప్పక పడుతుంది. ఏ సగటు ప్రేక్షకులవల్ల అయితే టికెట్స్ తెగుతాయో, ఆ ప్రేక్షకులే క్రమంగా  సినిమాకు దూరమవుతారు. లేదా, పక్కదారులు వెతుక్కుంటారు.    

ఇప్పుడు జరుగుతోంది అదే. 

- మనోహర్ చిమ్మని 

Wednesday, 19 November 2025

The Overscheduled Life Is Not Worth Living


Somewhere along the way, we all started worshipping busyness. 

Busyness addicted. 
Calendars packed.
Back-to-back calls.
Zero breathing room.

And we convinced ourselves...
This is profession.
This is business.
This is success. 

But being overscheduled is nothing more than a self-built cage. 

A prison with fancy walls, where you keep running but never actually live.

Life isn’t meant to be a checklist. 

It’s meant to be felt… savored… tasted… lived with a little style.

When you’re overscheduled,
you lose the magic.
You lose the spark.
You lose yourself.

So slow down.
Say no.
Make space.
Let your mind wander.
Let your soul breathe.

Because the life that’s truly yours — the life that feels rich, creative, meaningful — won’t appear on a crowded calendar. 

It shows up only when you do.

- Manohar Chimmani  

పంచాక్షరమిదమ్ పుణ్యమ్


ప్రదీప్‌చంద్ర నాలాగే పది పడవల మీద కాళ్ళుపెట్టాడు. ఎక్కడా సెట్ అవ్వలేదు. 

ఒకదానికొకటి సంబంధం లేని రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, సంగీతంలో కూడా పీజీ... ఏదీ అతన్ని కుదురుగా ఒక పనికొచ్చే మైండ్‌సెట్‌కు సెట్ చేసి, స్థిరంగా ముందుకు నడిచేలా చెయ్యలేకపోయాయి. 

సినిమా భాషలో చెప్పాలంటే, "మైండ్ దొబ్బింది."  

అసలెందుకు మొదలెట్టాడో అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ కీబోర్డు ముందు కూర్చున్నాడు. 

ఫిలిం మ్యూజిక్ కంపోజింగ్ ఒక్కటే కాదు. ఫోక్, డివోషనల్, ప్రయివేట్ రొమాంటిక్ ఆల్బమ్స్, ర్యాప్... ఇప్పుడు అన్నీ కంపోజ్ చేస్తున్నాడు ప్రదీప్.

కొత్త సింగర్స్‌ను కూడా పరిచయం చేస్తున్నాడు.    

కట్ చేస్తే -      

ఇప్పుడు హాట్ హాట్‌గా ఒక అయిదు పాటల కొత్త ప్రయివేట్ ఆల్బం చేస్తున్నాడు ప్రదీప్. సోలో ఫిమేల్ వాయిస్ అనుకుంటాను. 

ఆల్బంకి ముందు, మళ్ళీ మ్యూజిక్ మూడ్ లోకి రావడానికి ఓ రెండు భక్తి పాటలు చేశాడు. అందులో ఒకటి నా యూట్యూబ్ చానెల్ నుంచి మొన్ననే అప్లోడ్ చేశాం.   

"నాగేంద్ర హారాయ", శివ పంచాక్షరి మంత్రం.

మంచి సూదింగ్ కంపోజింగ్. సంతోష్ సాగర్ చేత పాడించాడు.    

ఈ శివ పంచాక్షరి మంత్రం 51,000 వ్యూస్ హిట్ చేసిన సందర్భంగా ప్రదీప్‌కి కంగ్రాట్స్. 


కట్ చేస్తే -

పోస్ట్-ప్రొడక్షన్లో ఉన్న నా రోడ్ క్రైమ్ డ్రామా "ఎర్ర గులాబి" సినిమాలో కూడా ఒక ఐటమ్ నంబర్, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రదీపే చేస్తున్నాడు.

నా రొమాంటిక్ హారర్ సినిమా "స్విమ్మింగ్ పూల్" ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రదీప్‌చంద్ర, ఇప్పుడు నేను చేయబోతున్న కొత్త సినిమాకి పనిచేస్తున్నాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ ఈసారి ముంబై అనుకుంటున్నాడు. 

ప్రదీప్ పూర్తి ఫోకస్ ఇప్పుడు పూర్తిగా మ్యూజిక్ పైనే ఉంది. అతను అనుకున్నది ఇప్పుడు సాధిస్తాడు. 

Focus clearly on what you love. Eventually, that itself will bring you everything you truly want — and more.

- మనోహర్ చిమ్మని 

Monday, 17 November 2025

Make Films a Ritual


Make films like it’s a ritual. Not a chore. Not a checklist. A soulful practice you return to again and again — like a hobby, a therapy, a meditation. 

When you show up to cinema with reverence, it rewards you in ways nothing else can. 

Because filmmaking isn’t just a craft. It’s a universe.

It carries everything inside it — the name, the money, the contacts, the glitter, the fascination, the sex, the madness, and the soul. Cinema is chaos with a heartbeat.

And remember this: funders and producers aren’t a big problem if your commitment and conviction to making films is deadly serious. When you’re all in, the right people appear.

And here’s the beautiful truth:
When you commit to the ritual, the films themselves pull you forward. They bring the fame, the fortune, the friendships, the doors you didn’t even know existed. You don’t chase the world — the world starts chasing you.

So make films.
Make them with obsession.
Make them with love.
Make them until the ritual becomes your destiny.

The screen will take care of the rest. 

- Manohar Chimmani

చలనచిత్రమ్!


సినిమానే థెరపీ. 
సినిమానే యోగా.
సినిమానే ఆనందం. 
సినిమానే నా ఫిలాసఫీ.
సినిమానే నా స్పిరిచువాలిటీ. 

కనీసం ఒక ఏడాదివరకు - సినిమాలు తప్ప ఇంకొకదాని గురించి ఆలోచించలేను. ఇక్కడ బ్లాగులో రాయలేను.

కట్ చేస్తే - 

సినిమానే ఇకనుంచీ నా స్ట్రెస్ బస్టర్ కూడా. 

నేను కోల్పోయిన నా ఫ్రీడమ్‌ను నేను తిరిగి సంపాదించుకొనేది కూడా సినిమా ద్వారానే. 

Every director lives two lives: one behind the camera, and one inside the story.  

- మనోహర్ చిమ్మని