Friday, 21 November 2025

ఫస్ట్రేషన్లో పొరపాట్లు జరుగుతాయి. కాని...


ఒకవైపు అన్ని వేల మంది ముందు ప్రత్యక్షంగా, మరోవైపు కోట్ల మంది ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా లైవ్ చూస్తున్నారని తెలిసీ... ఫస్ట్రేషన్లో మరీ అంత కంట్రోల్ తప్పి, అంత కేర్‌లెస్‌గా రాజమౌళి మాట్లాడ్డం నిజంగా ఊహించనిది.

ఫస్ట్రేషన్లో పొరపాట్లు జరుగుతాయి. అది సెన్సిటివ్ విషయాల మీద అయినప్పుడు సింపుల్‌గా ఒక క్షమాపణ చెప్పేస్తే పోయేదేం లేదు. రాజమౌళి కూడా మామూలు మనిషే కాబట్టి, మామూలుగా ఒక చిన్న "చింతిస్తున్నాను" మెసేజ్ పెడితే అయిపోతుంది కదా?!  

కట్ చేస్తే - 

రాజమౌళి "నాస్తికుడు" కావడం అతని ఇష్టం. దానికి ఎవ్వరి అభ్యంతరం ఉండదు, ఉండకూడదు. దీనికోసం పక్కనెవరో ఇంకో డైరెక్టర్ రాజ్యాంగంలోని ఆర్టికిల్ నంబర్ చెప్తూ డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు.     

కాని, క్షమాపణ చెప్పడానికి ఇంత ఈగో ఫీలయ్యే "దేవుళ్ళ మీద నమ్మకంలేని నాస్తిక" రాజమౌళి... అదే దేవుళ్ళ ప్రస్తావన, కథ, పాత్రలు లేని సినిమాలు చేసుకోవాలి.   

బాహుబలిలో శివలింగం ప్లేస్‌లో ఇంకోటి ఏదైనా పెట్టుకోవాల్సి ఉండే. ఇప్పుడు వారణాసి టైటిల్, అందులో రాముని పాత్ర, హనుమంతుడు... ఇవన్నీ వాడుకొంటూ నాస్తికుడు దేవుళ్ళతో బిజినెస్ చేసుకోవచ్చా? అక్కడ ఈగో అడ్డు రాదా? 

ఆస్తిక ప్రస్తావన లేకుండా నాస్తికుడు సబ్జెక్టులు తయారుచేసుకోలేడా?  

అది చాతకాకపోతే అలాగే చేసుకొని బ్రతకొచ్చు.

కాని, "మీ హనుమంతుడు ఏం చేశాడు" అని అంతమంది ముందు సొంత తండ్రి, సొంత భార్య నమ్మకాల్ని అలా ఎగతాళి చెయ్యటం ఏం బాగుంది? 

- మనోహర్ చిమ్మని  

PS:
ఇది అసూయ కాదు. హాలీవుడ్ స్థాయిలో అంత భారీ సినిమా చేస్తూ, ఒక చిన్న స్లిప్ ఆఫ్ ద టంగ్ పొరపాటుని పెద్ద సమస్య చేసుకోకపోతే బాగుంటుందని. అంతే.

PPS: 
నిజమైన ఫ్రెండ్స్ అయితే నాలా "ఒక సారీ చెప్పెయ్, అయిపోతుంది" అని సలహా ఇస్తారు. ఇంకా దీన్ని సాగదీయరు.        

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani