Wednesday, 19 November 2025

పంచాక్షరమిదమ్ పుణ్యమ్


ప్రదీప్‌చంద్ర నాలాగే పది పడవల మీద కాళ్ళుపెట్టాడు. ఎక్కడా సెట్ అవ్వలేదు. 

ఒకదానికొకటి సంబంధం లేని రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, సంగీతంలో కూడా పీజీ... ఏదీ అతన్ని కుదురుగా ఒక పనికొచ్చే మైండ్‌సెట్‌కు సెట్ చేసి, స్థిరంగా ముందుకు నడిచేలా చెయ్యలేకపోయాయి. 

సినిమా భాషలో చెప్పాలంటే, "మైండ్ దొబ్బింది."  

అసలెందుకు మొదలెట్టాడో అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ కీబోర్డు ముందు కూర్చున్నాడు. 

ఫిలిం మ్యూజిక్ కంపోజింగ్ ఒక్కటే కాదు. ఫోక్, డివోషనల్, ప్రయివేట్ రొమాంటిక్ ఆల్బమ్స్, ర్యాప్... ఇప్పుడు అన్నీ కంపోజ్ చేస్తున్నాడు ప్రదీప్.

కొత్త సింగర్స్‌ను కూడా పరిచయం చేస్తున్నాడు.    

కట్ చేస్తే -      

ఇప్పుడు హాట్ హాట్‌గా ఒక అయిదు పాటల కొత్త ప్రయివేట్ ఆల్బం చేస్తున్నాడు ప్రదీప్. సోలో ఫిమేల్ వాయిస్ అనుకుంటాను. 

ఆల్బంకి ముందు, మళ్ళీ మ్యూజిక్ మూడ్ లోకి రావడానికి ఓ రెండు భక్తి పాటలు చేశాడు. అందులో ఒకటి నా యూట్యూబ్ చానెల్ నుంచి మొన్ననే అప్లోడ్ చేశాం.   

"నాగేంద్ర హారాయ", శివ పంచాక్షరి మంత్రం.

మంచి సూదింగ్ కంపోజింగ్. సంతోష్ సాగర్ చేత పాడించాడు.    

ఈ శివ పంచాక్షరి మంత్రం 51,000 వ్యూస్ హిట్ చేసిన సందర్భంగా ప్రదీప్‌కి కంగ్రాట్స్. 


కట్ చేస్తే -

పోస్ట్-ప్రొడక్షన్లో ఉన్న నా రోడ్ క్రైమ్ డ్రామా "ఎర్ర గులాబి" సినిమాలో కూడా ఒక ఐటమ్ నంబర్, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రదీపే చేస్తున్నాడు.

నా రొమాంటిక్ హారర్ సినిమా "స్విమ్మింగ్ పూల్" ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రదీప్‌చంద్ర, ఇప్పుడు నేను చేయబోతున్న కొత్త సినిమాకి పనిచేస్తున్నాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ ఈసారి ముంబై అనుకుంటున్నాడు. 

ప్రదీప్ పూర్తి ఫోకస్ ఇప్పుడు పూర్తిగా మ్యూజిక్ పైనే ఉంది. అతను అనుకున్నది ఇప్పుడు సాధిస్తాడు. 

Focus clearly on what you love. Eventually, that itself will bring you everything you truly want — and more.

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani