Thursday, 20 November 2025

హాలీవుడ్ స్థాయి సినిమాల్ని తీయటం మంచిదే. కానీ...


ఈ డిజిటల్-ఏఐ-జెన్‌జీ-సోషల్‌మీడియా సునామీ యుగంలో - ప్రిరిలీజ్ లాంటి పరస్పరం డప్పులు కొట్టుకొనే రొటీన్ బోరింగ్ టైప్ ప్రమోషన్లు లేకుండా సినిమాకు హైప్ తీసుకురాలేమా? బిజినెస్ చెయ్యలేమా? రిలీజ్ చెయ్యలేమా? 

ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల డాలర్ల బిజినెస్ చేసుకునే ఒక్క హాలీవుడ్ సినిమాకు కూడా ఇప్పటివరకు ఇలాంటి ప్రమోషన్లు లేవు. 

సినిమా గురించి ట్రేడ్ ఎనౌన్స్‌మెంట్, స్టూడియో ప్రెస్ రిలీజ్, ఫైనల్ కాస్ట్ రివీల్, షార్ట్ వీడియో స్నిప్పెట్స్, బిహైండ్ ద సీన్ ఫోటోలు, ఫెస్టివల్స్‌లో ప్రీమియర్స్, బ్రాండ్ టై-అప్స్, మ్యాగజైన్ కవర్స్, ఆర్టికిల్స్, ఫ్యాన్ స్క్రీనింగ్స్, క్రిటిక్స్ స్క్రీనింగ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ స్క్రీనింగ్స్, నాలుగైదు షోల్లో ఇంటర్వ్యూలు, ప్రెస్‌ నోట్స్, రిలీజ్ న్యూస్, స్టాండర్డ్‌గా ఒక్క పోస్టర్, ఒక్క అఫీషియల్ ట్రయలర్. అంతే. 

అదీ హాలీవుడ్ సినిమా ప్రమోషన్, మార్కెటింగ్. 

ప్రమోషన్ బడ్జెట్ ఉంటుంది. అంతా డిజిటలైజ్డ్ ప్రమోషనే తప్ప, ఎక్కడా వేలాదిమందిని ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ చేసే కార్యక్రమాలుండవు. 

ఒక్కసారి ఏదైనా జరగరానిది జరిగితే, ప్రమాదం తీవ్రస్థాయిలో ఉంటుంది. ఎవ్వరూ దేన్నీ కంట్రోల్ చెయ్యలేరు. 

హాలీవుడ్ స్థాయి సినిమాల్ని తీయటం మంచిదే. ప్రమోషన్ విషయంలో కూడా హాలీవుడ్ స్థాయికి మనం ఎందుకు వెనకబడి ఉండాలి?   

కట్ చేస్తే -

మనదగ్గర ఒక్క టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌కే 30 కోట్ల ఖర్చు. ప్రత్యక్షంగా వేలాది మంది ఫ్యాన్స్‌తో ఈవెంట్లు. 

ఇంక రిలీజ్ వరకు ఎన్ని ఈవెంట్స్ ఉంటాయో, ఎంత ఖర్చవుతుందో ఊహించవచ్చు. 

ఈ ఖర్చుతోనే ఇంకో భారీ బడ్జెట్ సినిమా ఈజీగా తీయొచ్చు.

ఇలాంటి భారీ మార్కెటింగ్ జిమ్మిక్స్‌తో భారీగా బిజినెస్ చెయ్యొచ్చు, భారీగా లాభాలు పొందొచ్చు. భారీగా రెమ్యూనరేషన్స్ పెంచుకోవచ్చు. వీటన్నిటి అంతిమ లక్ష్యం అదే కాబట్టి తప్పేం లేదు. 

కాని, తిరిగి తిరిగి ఈ ఖర్చు భారం సామాన్య ప్రేక్షకుడిపైన పడకూడదు. కాని, తప్పక పడుతుంది. ఏ సగటు ప్రేక్షకులవల్ల అయితే టికెట్స్ తెగుతాయో, ఆ ప్రేక్షకులే క్రమంగా  సినిమాకు దూరమవుతారు. లేదా, పక్కదారులు వెతుక్కుంటారు.    

ఇప్పుడు జరుగుతోంది అదే. 

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani