ఇదొక పచ్చి అబద్ధం.
అసలు అలాంటిది లేదు.
ఉండదు.
ఇప్పుడు లీడ్‌లో ఉన్న స్టార్స్, స్టార్ డైరెక్టర్ల సక్సెస్ వెనుక మినిమమ్ ఒక పదేళ్ల తపస్సులాంటి కృషి ఉంటుంది. ఆకలి రాత్రులు, అవమానాలకు లెక్కే ఉండదు.
సినిమా రంగంలో పనిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఇతర సినీ అనుబంధరంగాలవాళ్ళు అందరికీ ఇది వర్తిస్తుంది.
ఆమధ్య నేను వెళ్లిన ఒక యువ దర్శకుడి ఆఫీస్‌లో ఒక కొటేషన్ ఒకటి గోడకి అతికించి ఉంది:
“It took 15 years to get overnight success!” అని.
ఇదే కొటేషన్‌ను సుమారు ఓ 20 ఏళ్ళ క్రితం స్పిరిచువల్ మార్కెటింగ్ గురు జో వైటలి రాసిన ఒక పుస్తకంలో చదివాను.
సినిమా ఇండస్ట్రీలో ఈ సోకాల్డ్ "ఓవర్‌నైట్ సక్సెస్"లు ఎక్కువగా కనిపిస్తాయి. కాని, ఆ ఓవర్ నైట్ సక్సెస్‌ల వెనుక ఎన్నో ఏళ్ల కష్టాలు, ఎంతో కృషి ఉంటుంది. అది బయటి వారికి కనిపించదు. ఇన్‌స్టంట్‌గా వారికి కనిపించేది రెండే రెండు విషయాలు.
సక్సెస్, ఫెయిల్యూర్.
There’s no such thing as overnight success. There are years of silent hunger, unseen grind, and behind-the-curtain battles — But the world doesn’t watch the struggle. It only applauds the spotlight.
-మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani