ముందు "ఏంట్రా ఇది" అనుకున్నాను. ఒక గంట తర్వాత "ఇదే కదా మనకు కావల్సింది" అనిపించింది.
ఆ తర్వాత డజన్లసార్లు వెళ్ళాను ఈ క్రియేటివ్ పీపుల్స్ అడ్డాకు. ఆఫీసులో జరిగే కొన్ని మీటింగ్స్‌ను కూడా అక్కడ పెట్టుకొనేవాళ్ళం.
కాఫీలు, టీలు, సాఫ్ట్ డ్రింక్స్, స్నాక్స్ అన్నీ బయట దొరికేవే. ఇటాలియన్, అమెరికన్, కాంటినెంటల్, బెవెరేజెస్, డెజెర్ట్స్... అన్నీ చాలా బాగుండేవి. ప్రజెంటేషన్, యాంబియెన్స్ ఇంకా బాగుంటాయి. ఫిలిం ఫ్రీక్స్, క్రియేటివ్ పీపుల్ కదా... బయటి ఓపెన్ సిట్టింగ్స్‌లో ఎక్కడైనా సిగరెట్స్ తాగొచ్చు.
కట్ చేస్తే -
ఎందుకో తెలీదు గాని, రోడ్ నంబర్ 36లో బియాండ్ కాఫీ మూసేసి చాలారోజులైంది. అలాంటి యాంబియెన్స్ ఉన్న కాఫీబార్-కమ్-క్రియేటివ్ స్పాట్ ఇంకెక్కడైనా ఉందా?
మా కొంపల్లి, సికింద్రాబాద్ వైపు కూడా ఇలాంటివి తప్పక ఉండి ఉండాలని నా గట్టి నమ్మకం. తెలిస్తే ఎవరైనా చెప్పండి. థాంక్స్ ఇన్ అడ్వాన్స్!
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani