Wednesday, 25 March 2026

మనం నమ్మితీరాల్సిన "బటర్‌ఫ్లై ఎఫెక్టు!"


అంతకుముందు సినిమాల్లో చూసినప్పుడు, బుక్స్‌లో చదివినప్పుడు, ఎవరైనా చెప్పినప్పుడు... ఈ "బటర్‌ఫ్లై ఎఫెక్ట్" గురించి నేను పెద్దగా నమ్మలేదు.

కాన్సెప్ట్ శాస్త్రీయమైనదే అయినా చాలా లైట్ తీసుకున్నాను. నవ్వాను కూడా.  
 
కాని అది నిజం అని ఇప్పుడు నమ్ముతున్నాను. 

"ప్రజలు కోరుకొన్న ఒక మార్పు కోట్లాది మంది జీవితాల్ని, వ్యాపారాలను, ఉద్యోగాలను, ఆలోచనలను, ప్లాన్స్‌నూ, మొత్తం ఆర్థికస్థితిగతుల్ని కూడా కిందామీదా చెయ్యగలదు" అన్నది ఇప్పుడు నేను నా కళ్ళారాచూస్తున్నాను. 

ఇక్కడ బటర్‌ఫ్లై ఎఫెక్ట్... ఒక మార్పు. 

ఒకటి రాష్ట్రస్థాయిలో జరిగింది.
ఇంకోటి అంతర్జాతీయంగా జరిగింది. 

ప్రాంతీయంగా ఒకరు, అంతర్జాతీయంగా ఒకరు... మొత్తం అల్లకల్లోలం చేస్తున్నారు. 

అయితే... ఈ మార్పు, ఈ ఎఫెక్టు ప్రజలు కోరుకున్నదే కావడం విశేషం.

కట్ చేస్తే - 

ఇక్కడ మనదగ్గర, జస్ట్ గత రెండున్నరేళ్లలో, అప్పటివరకు బాగా నడుస్తున్న, నాకు బాగా తెలిసిన, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పూర్తిగా బిజినెస్ లేక ఎంతో నష్టపోయింది.   

జీరో సేల్స్.
జీరో రిజిస్ట్రేషన్స్.
జీరో ఇన్‌కమ్.

ఆ కంపెనీకి ఉన్న 7 ఆఫీసుల్లో... ఒకదాని తర్వాత ఒకటిగా, గత రెండేళ్ళలో మొత్తం 6 ఆఫీసులను నా కళ్ళముందే మూసేశారు. చివరి ఆఫీసు (7 వది) అప్పుడా ఇప్పుడా అన్నట్టుంది. దాదాపుగా అది కూడా మూసేసినట్టే. నేనే ప్రత్యక్ష సాక్ష్యం.  

హైద్రాబాద్‌లోని అన్ని ప్రధాన బిజినెస్ సెంటర్స్‌లో ఖాళీ అయిన ఎన్నో ఆఫీసులు, వ్యాపార సంస్థల బిల్డింగులకు "టు లెట్"లు వేలాడుతున్నాయి. 

#ButterFlyEffect నిజంగా నిజమే అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? 

జస్ట్ ఇదొక ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు మన చుట్టూవున్న మనుషుల జీవితాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లో... లెక్కలేనన్ని ఉంటాయి.  

విషాదం ఏంటంటే... ఇలాంటి బటర్‌ఫ్లై ఎఫెక్టును ఎంజాయ్ చెయ్యడానికి ఇదేం సుకుమార్ సినిమా కాదు.  

జీవితం.     

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani