"నా ఇన్నేళ్ళ కెరీర్‌లో నేను మొదటి నుంచీ ఒక రూల్ చాలా ఖచ్చితంగా పాటిస్తున్నాను. ఏంటంటే... నేను ఎవ్వరి పర్సనల్ వ్యవహారాల్లో, ప్రేమ వ్యవహారాల్లో, డబ్బుల వ్యవహారాల్లో, బిజినెస్ వ్యవహారాల్లో, ప్రొఫెషనల్ వ్యవహారాల్లో అస్సలు వేలు పెట్టను. కల్పించుకోను.
ఇది నేను అనుభవం మీద నాకు నేను నేర్చుకుని పాటిస్తున్న డిసిప్లిన్. ఈ ఒక్క డిసిప్లినే నన్ను ఇండస్ట్రీలో ఈరోజు నేను ఈ స్థాయికి రావటంలో నాకు బాగా ఉపయోగపడింది.
ఈ డిసిప్లిన్ వల్ల నాకు జరిగిన ఇంకో మంచి ఏంటంటే... నేనెలా ఉంటానో ఎదుటివాళ్ళంతా నాతో అలాగే ఉంటారు!"
దటీజ్ షారూక్ ఖాన్!
వినటానికి చాలా సింపుల్‌గా ఉంది. కాని, ఈ డిసిప్లిన్ పాటించడం అంత ఈజీ కాదు. అందరివల్ల కాదు.
వడపావ్, పావ్ బాజీలతో ఆకలి తీర్చుకొంటూ, షెల్టర్ లేనప్పుడు ముంబై రైల్వే స్టేషన్లలోని బెంచీల మీద పడుకొంటూ సినిమా అవకాశాల కోసం తిరిగిన నేపథ్యం ఉన్న షారుక్ ఖాన్ అంత ఈజీగా, జస్ట్ అలా ఊరికే, బాలీవుడ్ కింగ్ కాలేదు.
షారుక్ ఖాన్ ఫస్ట్ నాన్-సినిమా పేమెంట్ 50 రూపాయలు. ఫస్ట్ సినిమా అడ్వాన్స్ 11,000 రూపాయలు. ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోగా షారుక్ నెట్‌వర్త్ 11,000 కోట్లు!
The film industry is a strange place where dreams are sold, talent is tested, and only persistence survives.
కట్ చేస్తే -
కన్సిస్టెన్సీ కోసం అప్పటికప్పుడు అనుకొని ఏదో ఓ కొత్త హాబీ మొదలెడుతుంటాను. అలా మొదలెట్టిన ఎన్నో హాబీల్లో ఈ "మనోహరమ్" డిజిటల్ బులెటిన్ కూడా ఒకటి. కాని, ఇప్పుడు నేను పూర్తిస్థాయిలో సినిమాలు చేసే పనిలో బిజీ అయిపోతున్నాను కాబట్టి ఈ బులెటిన్ కోసం సమయం కెటాయించటం ఇంక కుదిరేలా లేదు. సో, రేపటి నుంచి బులెటిన్ రాదు.
బులెటిన్ లేకపోయినా, నా ఆర్టికిల్స్ రెగ్యులర్‌గా నా బ్లాగ్‌లో చదవొచ్చు. అవే ఆర్టికిల్స్ నా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తుంటాను. మీరు అక్కడ కూడా చదవొచ్చు.
థాంక్యూ.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani