Saturday, 21 March 2026

స్ట్రాటెజిక్‌గా ఇది ఎంత చెత్త నిర్ణయం అంటే...


ఎప్పటికప్పుడు "ఈ ఒక్క సినిమా తీసి వదిలేద్దాం" అనుకోవటం అంత వెర్రివెంగలప్ప డెసిషన్ ఇంకోటి ఉండదు. 

ఆఫ్‌కోర్స్, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక చాలామందికి వారి సినిమా కష్టాలు, అనుభవాలు, అవమానాలు చాలా ఉండొచ్చు.

అయినా సరే, అది నిజంగా ఒక అర్థం లేని నిర్ణయమే. 

కట్ చేస్తే - 

ఇలాంటి పసలేని చప్పటి నిర్ణయం ఇండస్ట్రీలో చాలామంది తీసుకుంటుంటారు. తర్వాత ఎప్పుడో ఒక పదేళ్ళ తర్వాత బాధపడుతుంటారు. 

స్ట్రాటెజిక్‌గా ఇది ఎంత చెత్త నిర్ణయం అంటే... ఈ నిర్ణయం బాక్‌డ్రాప్‌లో మనం తీసుకునే ఇతర నిర్ణయాలన్నీ మరింత చెత్తగా ఉంటాయి. 

కర్ర విరగదు, పాము చావదు.  
ఆ "ఒక్క సినిమా" అనుకున్నట్టు జరగదు.  

నిజంగా సినిమాల్ని వదిలేసేటప్పుడు ఆ క్షణం జస్ట్ అలా అనుకొని చిటికెలో వదిలేయవచ్చు కదా? 
దాని గురించి ఇప్పుడే ఎందుకు? 

ఈ క్రమంలో ఈగోలు, అడ్డంకులు, అవమానాలు, డబ్బు కష్టాలు చాలా ఉంటాయి. 

నిన్నొక మోసగానిలా చూస్తారు. నిర్మొహమాటంగా మొహం మీదే అంటారు. అన్నీ తట్టుకోవాలి.   

మణిరత్నం, శేఖర్ కపూర్ లాంటి లెజెండ్స్ కంటే ఎక్కువేం కాదుకదా నువ్వు? వాళ్ళు ఎదుర్కొన్న అవమానాల ముందు నువ్వెంత? 

ప్రాణాల్ని తీస్తాం అంటారు. అలాంటివారికి అప్పజెప్తాం అంటారు. ఇంకేమేమో చేస్తామంటారు.  

మీలో నిజంగా నిజాయితీ లేకపోతే అలాగే కానీయండి. ఏదో ఒకరోజు పోవాల్సిందేగా ఎవరైనా?   

అందరం పోతాం. పోయేలోపు మాత్రం...    
ఇలాంటి చెత్త సఫొకేషన్ నుంచి కాస్తంత ఊపిరి తెచ్చుకోవాలి. 

ఒక్కటే ఫోకస్.  
జస్ట్ వన్ థింగ్. 
ఫ్రీడమ్. 

ఇంకొకరికి జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి నుండి పూర్తి ఫ్రీడమ్.

తర్వాత సంగతి తర్వాత.   

- మనోహర్ చిమ్మని        

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani