చాలా గ్యాప్ తర్వాత మొన్నామధ్య మా స్టుడెంట్ భరత్ కలిశాడు. ఇద్దరం ఒక రెండుమూడు గంటలు చాలా ఓపెన్‌గా మాట్లాడుకున్నాం.
భరత్ యు యస్ వెళ్ళి, అక్కడ చదివి, కొన్నేళ్ళు ఉద్యోగాలు చేసి, "ఓస్ ఇంతేనా అమెరికా" అని ఫీలయ్యి తిరిగి భారత్ వచ్చేశాడు.
వస్తూనే "గై ఆన్ ది సైడ్‌వాక్" పేరుతో ఒక ఇంగ్లిష్ బెస్ట్ సెల్లర్ ఫిక్షన్ రాశాడు.
ఇక్కడ ఒక మల్టినేషనల్ కంపెనీలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
కొంచెం గ్యాప్ తర్వాత, ఇప్పుడు మళ్ళీ సీరియస్‌గా రాయడం మొదలెట్టాడు భరత్.
బహుశా మే నెలలో భరత్ కొత్త బుక్ లాంచ్ ఉంటుంది. ఈసారి ఆ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పాను.
కట్ చేస్తే -
నాకో సలహా ఇచ్చాడు మా భరత్...
"మీరు సినిమాలు చేసుకుంటారో, ఇంకేం చేస్తారో నాకు తెలీదు. మీరు బాగా రాస్తారు. రాయండి. కథలు రాయండి. నవల్స్ రాయండి. రాయటమే ప్రయారిటీగా పెట్టుకోండి" అని ఖరాఖండిగా చెప్పాడు.
భరత్‌లో నాకు నచ్చేది అదే. నిర్మొహమాటంగా అనుకున్నది చెప్పేస్తాడు. నో షుగర్ కోటింగ్.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani