డిపెండెన్సీ... అనేది ఎప్పుడూ మంచిది కాదు. మనం ఊహించని టైమ్‌లో అది కొట్టే దెబ్బ నుంచి మనం కోలుకోడానికి చాలా టైమ్ పడుతుంది. మానసిక బలహీనులైతే అసలు కోలుకోలేరు.
ఇవ్వాళ మధ్యాహ్నం నేనూ, నా ఫ్రెండ్ ఒకరు ఇదే విషయం కాసేపు మాట్లాడుకున్నాం.
బిజినెస్ & డబ్బు విషయంలో ఏ ఒక్కరి మాట, ఏ ఒక్కరి ప్రామిస్‌ను "టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోవడం" అంత పెద్ద తప్పు ఇంకోటి ఉండదు.
కట్ చేస్తే -
అర్నాల్డ్ ష్వార్జ్‌నిగ్గర్ "నో ప్లాన్-బి" అంటాడు. అది అందరికీ, అన్నివేళలా కుదరదు. అర్నాల్డ్‌కు కుదిరింది అంతే.
ప్లాన్-బి నుంచి సి-డి-ఇ... అవసరమైతే ప్లాన్-ఎఫ్ కూడా అవసరం. ఇది అనుభవం మీదే తెలుస్తుంది.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani