టీనేజ్‌లో నేను కూడా నాన్‌చాక్ తిప్పాను. కరాటే నేర్చుకున్నాను. అప్పట్లో మా ఇంటిచుట్టూ అందరూ కరాటే మాస్టర్‌లే. కొత్తగా అప్పట్లో అదొక వేవ్ అనుకోవచ్చు.
ఫోటోలు తీసుకోవాలన్న ఆలోచన అప్పుడు లేదు. మొబైల్స్ కూడా లేని కాలం అది. ఏమాత్రం ఐడియా ఉన్నా ఏదోలా ఒక ఫోటో లాగించేవాణ్ణి.
ఈ బచ్చాలాట జోక్స్ పక్కనపెడితే... ఇక్కడ పాయింట్ కరాటే, నాన్‌చాక్ కాదు.
బ్రూస్‌లీ!
జస్ట్ 32 ఏళ్లకే తను అనుకొన్న ప్రతి ఒక్కటీ సాధించిన ఒక పెద్ద 'సక్సెస్ స్టోరీ' బ్రూస్లీ.
కేవలం 32 ఏళ్లకే తన లక్ష్యాలన్నీ సాధించేసి, చెప్పాల్సినవన్నీ చెప్పేసి, ఆర్జీవీ లాంటి డైరెక్టర్స్‌కు కూడా ఇన్‌స్పిరేషన్ అవుతూ, ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఆదరా బాదరా వెళ్లిపోయాడు.
కట్ చేస్తే -
ప్రపంచం అంతా 'పర్సనల్ డెవలప్‌మెంట్' అనే ఒక ఫీల్ గుడ్ మాయలో పడికొట్టుకొంటోంది. బుక్స్, క్లాసులు, వర్క్‌షాపులు, రిట్రీట్స్ పేరుతో బిలియన్లకొద్దీ డాలర్ల బిజినెస్‌గా రోజురోజుకీ కొత్తపుంతలుతొక్కుతోంది.
ఇప్పుడు మనదేశంలో కూడా.
వేళ్లూనుకుపోయిన కొన్ని సోకాల్డ్ శాస్త్రాల్లాగే, సైన్స్‌కు నిలబడని 'సీక్రెట్' ఇది. క్విక్ ఫిక్స్ కోసం నిరంతరం తపించే మనిషి బలహీనతమీద డబ్బు సంపాదించుకొనే పెద్ద మాయ ఈ "పర్సనల డెవలప్‌మెంట్".
పాయింట్ ఏ నుంచి పాయింట్ బి కి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. లేకపోతే చేసుకొంటూవెళ్లాలి, నీటి ప్రవాహంలా.
ఎదురయ్యే పరిస్థితులను బట్టి, ఏ పాత్రలోకి చేరితే ఆ పాత్ర ఆకారంలోకి మారిపోయే నీటిగా మారాలి.
మన కోరికలు, మన కృషి సింక్ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. సింక్ కాకుండా చెడగొట్టడానికి 101 విధాల రాక్షసులో, పరిస్థితులో నిరంతరం అడ్డుపడుతుంటాయి. అది అత్యంత సహజం.
అయితే, ఫోకస్ చెడకుండా వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్లేవాడే చివరికి విజేత అవుతాడు.
తన అసామాన్యమైన విజయాలతో, 32 ఏళ్లకే, బ్రూస్‌లీ సాధించి చూపించింది అదే.
"Empty your mind. Be formless, shapeless, like water. You put water into a cup, it becomes the cup. You put water into a bottle, it becomes the bottle. You put it in a teapot, it becomes the teapot. Now water can flow or it can crash. Be water, my friend!" - Bruce Lee
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani