Saturday, 14 March 2026

సిండికేట్ అంటేనే సక్సెస్!


ఫిలిం ఇండస్ట్రీలో ఒంటరిపోరాటాలకంటే, ఒక నలుగురైదుగురు లైక్‌మైండెడ్ కలిసి చేసే సినిమాలే బాగా సక్సెస్ అవుతాయని వందలసార్లు ప్రూవ్ అయింది. 

ఒక్క సినిమాలోనే కాదు, ఏ ఫీల్డులో అయినా సరే, "సిండికేట్" అంటేనే సక్సెస్. 

ఒంటరి పోరాటంలో రిస్క్ ఫాక్టర్ ఎక్కువగా ఉంటుంది.   

ఒకటే బుర్ర కంటే, నాలుగు బుర్రలు యాక్టివ్‌గా పనిచేస్తూ, పవర్‌ఫుల్ నిర్ణయాలు తీసుకోగలుగుతాయి. డబ్బు భారం కూడా ఒక్కరి మీద కాకుండా, నలుగురిమీద ఉన్నప్పుడు పెద్ద బరువనిపించదు.    

ఇప్పుడు హేమాహేమీలుగా టాప్ పొజిషన్లలో ఉన్న ప్రొడ్యూసర్లలో ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు ప్రారంభంలో ఇలా ఒక సిండికేట్‌గా ఏర్పడి సినిమాలు చేసినవాళ్ళే.

అప్పుడయినా సరే, ఇప్పుడైనా సరే, వీరికి ఒంటరిగా చేసే సత్తా లేక కాదు. అదంతే. ఒక పెద్ద పనిని ఒక్కరే చేయటం కంటే, నలుగురు కలిసిచేయడం అన్నివిధాలా సులభంగా ఉంటుంది. 

ఇప్పటికీ మీరు చూడండి... దాదాపు ప్రతిసినిమాలో మెయిన్‌గా ఒక ప్రొడ్యూసర్ ఉన్నా కూడా, దాని సమర్పణ ఒకరు చేస్తారు. నిర్వహణ ఇంకొకరుంటారు. సహనిర్మాత ఇంకొకరుంటారు. వీళ్లంతా ఆ సినిమా నిర్మాణంలో భాగస్వాములే అన్నమాట. 

కట్ చేస్తే -

మంచి కంటెంట్‌తో ఒక చిన్న బడ్జెట్ సినిమా చెయ్యాలంటే ఒక రెండు కోట్లు అవుతుందనుకుంటే, దాన్ని ఒక్కరే చేయనవసరం లేదు. ఒక నలుగురు లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్లు కలిసిచెయ్యొచ్చు. రిస్క్-ఫ్రీ ప్రాజెక్టుతో అత్యధికస్థాయిలో లాభాలు పొందొచ్చు.   

నిజంగా ఈ ఫీల్డువైపు ప్యాషన్ ఒక్కటే కాకుండా, ఒక బిజినెస్‌గా కూడా ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్లు ఆలోచించవచ్చు. "సిండికేట్" అవొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ మీడియేటర్స్ కూడా వారికి మంచి బెనిఫిట్స్ ఉండే ఈ "సిండికేట్" ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఆలోచించవచ్చు. 

Want to know more? DM me.

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani