ఆదిత్యధర్ మొదటి సినిమా "యూరీ: ది సర్జికల్ స్ట్రైక్". హిట్ సినిమా. దాని ప్రొడ్యూసర్ రోనీ స్క్రూవాలా.
ఆదిత్యధర్ రెండోసినిమా కోసం బయటి ప్రొడ్యూసర్స్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. అయినాసరే, అత్నే ప్రొడ్యూసర్‌గా తనే రెండో సినిమా తీశాడు. బాలీవుడ్ రికార్డుల్ని తిరగరాసే బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చాడు. అదే "ధురంధర్".
సీన్ 2:
సందీప్‌రెడ్డి వంగా తన తన మొదటి సినిమా కథతో చాలామంది హీరోల చుట్టు తిరిగాడు, చాలామంది ప్రొడ్యూసర్స్‌ను కలిశాడు. ఎక్కడా సెట్ అవలేదు. ఓ రెండేళ్ళు ఇలా అగడిచిందనుకుంటాను.
ఇక లాభం లేదనుకొని సందీప్ వంగా వాళ్ళ అన్నయ్య, పేరెంట్స్ ధైర్యం చేశారు. ఒక మూడు కోట్లు రిస్క్ చేసి తను అనుకున్న స్క్రిప్టుతో సినిమా తీశాడు. బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. అదే "అర్జున్ రెడ్డి".
ఇదే సినిమాను బాలీవుడ్‌లో కూడా "కబీర్ సింగ్" పేరుతో రీమేక్ చేశాడు సందీప్ వంగా. అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ హిట్టే.
కట్ చేస్తే -
పై రెండు ఉదాహరణల్లో డైరెక్టర్స్ ఇద్దరూ చాలా పెద్ద రిస్క్ చేశారు. సినిమాలు హిట్ అయ్యాయి కాబట్టి బ్రతికిపోయారు. అదే ఫట్ అయితే?!
అలాగని, ఈ డైరెక్టర్స్ ఇద్దరూ డబ్బు బాగా వస్తుందని ప్రొడ్యూస్ చేశారా? కాదు.
ఆదిత్యధర్ క్రియేటివ్ ఫ్రీడమ్ కావాలనుకున్నాడు. ప్రొడ్యూసర్లు ధురంధర్‌లో కొన్ని సీన్లు ఒప్పుకోకపోవచ్చు. ఏదో ఒక దశలో ఏదో ఒక దగ్గర కాంప్రమైజ్ కావాల్సిరావచ్చు. అందుకే రిస్క్ తనే తీసుకున్నాడు ఆదిత్యధర్.
వంగా విషయం వేరు. ఆల్రెడీ హీరోలు, ప్రొడ్యూసర్స్ కోసం చాలా తిరిగాడు. ఇంకొన్నాళ్లయితే కాంప్రమైజ్ అయిపోయి, ఇంకోటేదో ప్రొడ్యూసర్స్ వినగానే ఒప్పుకొనే కథతో సినిమా తీసేవాడేమో. ఆ రిస్క్ ఇష్టం లేక, అర్జున్ రెడ్డి కోసం ప్రొడ్యూసింగ్ రిస్క్ తీసుకున్నాడు.
ఇద్దరూ అనుకున్నది సాధించారు. కాని, ఇలాంటి రిస్క్ తీసుకునే అవకాశం ఎంతమందికి ఉంటుంది? ఒకవేళ అలాంటి అవకాశం ఉన్నా, ఎంతమంది అలాంటి రిస్క్ తీసుకుంటారు?
సో, అప్పుడప్పుడూ డైరెక్టర్స్ కెరీర్‌లో ఇలాంటి రిస్కీ స్టెప్స్ కూడా తప్పవు.
మణిరత్నం, పూరి జగన్నాధ్ లాంటి డైరెక్టర్స్ వాళ్ళ సినిమాలను వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటున్నారంటే మొదటి కారణం డబ్బు మీద పిచ్చి కాదు.
క్రియేటివ్ ఫ్రీడమ్.
వాళ్ళు అనుకున్నట్టుగా సినిమా తీయడం కోసం.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani