ధురంధర్ కూడా ఒక సినిమా. అంతే.
రక్తపాతం, హింస మాత్రం అతి దారుణంగా ఉంది. ఇలాంటి సబ్జెక్టు ఇంత ఎఫెక్టివ్‌గా రావాలంటే బహుశా ఈ స్థాయి హింస సినిమాలో చూపించక తప్పలేదనుకుంటా.
భారత్‌లో జరిగిన కొన్ని సంఘటనల్ని చాప్టర్స్‌గా ప్లాన్ చేసుకున్నాడు. పనికిరాని హీరోయిజమ్ బిల్డప్స్ జోలికిపోలేదు. తాను అనుకున్న కథను ఒక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రెండు భాగాల్లో అద్భుతంగా రూపొందించి, ఒక ఫిలిం డైరెక్టర్‌గా రికార్డులు బ్రేక్ చేసుకుంటూవెళ్తున్నాడు... ఆదిత్యధర్.
కట్ చేస్తే -
కట్ చేస్తే -
"ఆదిత్యధర్ ఒక ప్రాపగాండా మూవీచేశాడు" అని అనేవాళ్ళు అనొచ్చు. వారికా ఫ్రీడమ్ ఉంది.
సినిమా కూడా ఇప్పుడొక అతి పెద్ద శక్తివంతమైన సోషల్ మీడియా సాధనంలాగా మారింది. ఈ పవర్‌ఫుల్ సాధనం అందరికీ అందుబాటులో ఉంది.
నిజంగా ధురంధర్ ఒక ప్రాపగాండా సినిమా అనుకుంటే, ఎవరి ప్రాపగాండా సినిమాలు వాళ్ళు తీసుకునే స్వేచ్ఛ ఈ దేశంలో అందరికీ ఉంది. దాదాపు ప్రతి పార్టీకి ఆమాత్రం ఫండ్స్ ఉన్నాయి, ఫండింగ్ సోర్సెస్ ఉన్నాయి. ఆయా పార్టీలకు అనుకూలమైన డైరెక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు.
మీడియాను, సోషల్ మీడియాను, సినిమాను ఎవరు ఎంత బాగా ఉపయోగించుకోగలుగుతారు అన్నదానిమీదే వచ్చే ఎన్నికల్లో జయాపజయాలు ఆధారపడివుంటాయి. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani