డబ్బులు ఎప్పుడూ సమస్య కాదు."
- సత్యజిత్ రే!
ఎలా కాదనగలం?
సత్యజిత్ రే "పథేర్ పాంచాలి" అలాగే తీశాడు. ఉద్యోగం చేస్తూ, జీతం వచ్చినపుడల్లా ఆ డబ్బుతో షూటింగ్ ప్లాన్ చేస్తూ, మరికొంతమంది మిత్రుల ద్వారా కూడా అవసరమయిన డబ్బు ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూ, అంచెలంచెలుగా తీశారు. అలాంటి అనుభవంతో చెప్పిన మాట అది.
సత్యజిత్ రే అలా తీసిన "పథేర్ పాంచాలి" సినిమానే ఆయనకు అంత పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సత్యజిత్ రే ఇంకెన్నో పిక్చర్లు తీశారు. ఆయన అనుకున్న సినిమాలే తీశారు.
విషయం ఇక్కడ ఆర్ట్ సినిమాలా, కమర్షియల్ సినిమాలా అన్నది కాదు. అనుకున్న సినిమాని ఒక కమిట్‌మెంట్ తో చేయగలగటం.
అసలు సినిమాలా ఇంకొకటా అన్నది కూడా సమస్య కాదు. చేయాలనుకున్న పని మీద ఒక క్లారిటీ, ఒక కమిట్‌మెంట్ ఉండటం. ఏది ఎలా ఉన్నా, ఆ ఒక్క లక్ష్యం మీదే దృష్టిపెట్టి ఆ దాన్ని పూర్తి చేసెయ్యటం.
అలాంటి ఫోకస్‌తో కష్టపడ్డ ప్రతి ఒక్కరూ ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించగలిగారు. వాళ్లు అనుకున్న మొదటి స్టెప్ వెయ్యగలిగారు. అదే ఫోకస్ కొనసాగించినవాళ్ళు ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యారు. ఇంకా ఇంకా సాధించారు.
కట్ చేస్తే -
ఇప్పుడు నిజంగా అంత ఫోకస్, అంత ఏకాగ్రత, అంత కమిట్మెంట్, అంత ఓపిక ఎవరికుంది?
అన్నీ ఇన్‌స్టంట్‌గా అయిపోవాలి! తెల్లారేసరికల్లా సినిమా ఎనౌన్స్ చెయ్యాలి, సెలబ్రిటీ అయిపోవాలి!!
ఇలాంటి మిరాకిల్ వెయ్యిలో ఏ ఒక్కరికో కావచ్చు. కాని, అందరికీ అది సాధ్యం కాదు.
ఒక డైరెక్టర్‌గా సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్ కావాలి నిజమే. కాని, ఎంతమంది కాబోయే డైరెక్టర్స్ ఆ స్థాయి స్క్రిప్టులు రాసుకొని రెడీగా ఉన్నారు?
"నా దగ్గర బ్లాక్ బస్టర్ కథ ఉంది" అని మాటల్లో చెప్పడం వేరు. నిజంగా ఆ స్థాయి కథని స్క్రిప్ట్ ఫార్మాట్‌లో ఒక మంచి స్క్రిప్టుగా రాసుకొని సిద్ధంగా ఉండటం వేరు.
నిజంగా ఇది చేయగలిగే వాళ్ళు ఆతర్వాత ఏం చెయ్యాలో అది కూడా చెయ్యగలుగుతారు. సినిమా తప్పకుండా డైరెక్ట్ చేస్తారు.
-మనోహర్ చిమ్మని
.jpeg)
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani