Tuesday, 7 October 2025

ఈ భూమి మీదకు ఇదొక చిన్న ప్రయాణం


ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు.
ఏవో కొన్ని జ్ఞాపకాలను వదిలి
ఒక్కొక్కరుగా అందరం
ఎలాగూ పోయేవాళ్ళమే.
కాస్త ముందూ వెనకా, అంతే.

ఈ లోగానే - 
అర్థంలేని ఈ ఉరుకులు పరుగులు
ఇన్ని తలకు మించిన భారాలు
ఎన్నో కష్టాలు
ఇన్ని అపార్థాలు
ఇంత నిరంతర వ్యథ 
నిజంగా అవసరమా? 

కొంచెం సంతోషం కూడా పంచుకుందాం. 

చావు, పుట్టుకలు మనచేతిలో ఉండవు. మన అంతిమ క్షణం మనం ఎన్నడూ ఊహించనివిధంగా ఉండొచ్చు. ఎవరికి తెలుసు?   

ఏవేవో గుర్తుకొస్తున్న ఈ క్షణం,  అంతా ఒక మాయలా అనిపిస్తుంది. నమ్మశక్యం కాకుండా ఉంటుంది. అసలిలా జరిగిందా అనిపిస్తుంది.  

కానీ, అన్నీ జరిగాయి.

మంచీ, చెడూ. 
ఆనందం, విషాదం. 
ఆదరణ, అవమానం. 

అదే జీవితం.

జీవితంలో ఎవ్వరు ఎంత ఎదిగినా, ఎగిరెగిరిపడ్దా, ఎన్ని లాజిక్కులు మాట్లాడినా, ఎంత ఈగోతో చెలరేగినా... అందరూ చివరికి ఏదో ఒక శక్తికి, ఒక నమ్మకానికి సరెండర్ అవ్వాల్సిందే. 

ఆ శక్తికి, ఆ నమ్మకానికి మనం పెట్టుకొనే పేరు ఏదైనా కావొచ్చు. దేవుడు, దేవత, యూనివర్స్... ఇంకేదైనా కావచ్చు.  

సరెండర్ అవ్వక మాత్రం తప్పదు. 

అప్పుడే అంతా బాగుంటుంది.

ఆనందమైనా, కన్నీళ్లయినా.

అదే జీవితం.

అదే ఆధ్యాత్మికమ్.

అదే హిప్పీస్. 
అదే ఓషో. 
అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్. 
అదే ఇష యోగా... 

ఇంకో వంద రూపాలు, వంద పేర్లు.

లక్ష్యం ఒక్కటే... ఆనందం.

ఈ క్షణం సంతోషంగా ఉండగలగడం. అనుక్షణం జీవించగలగటం. 

ఆధ్యాత్మికంలో ఉండే ఆ నిరాడంబరత వేరు. ఆ నిర్మలత్వం వేరు.

ఆ నిశ్చలత్వం. 
ఆ నిశ్శబ్దం. 
ఆ మానసిక ప్రశాంతత.

అందుకే, 1920 ల్లోనే మహా అగ్రెసివ్ రచయిత అయిన చలం లాంటివారు కూడా చివరికి రమణమహర్షి ఆశ్రమం చేరక తప్పలేదు.

అలాగని ఆధ్యాత్మికం అంటే అన్నీ వదిలేయటం కూడా కాదు.

కాకూడదు.  

ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు.

Being spiritual does not mean giving up everything. The true test is to have everything and yet not to attached to them.     

- మనోహర్ చిమ్మని 

Monday, 6 October 2025

The Pilgrimage Within


Spirituality is a pilgrimage — one you take inward.
Sometimes barefoot. Sometimes broken.
Sometimes with clarity. Often with confusion.

You’ll stop many times and wonder if you’re lost.
You’ll meet beautiful truths and uncomfortable realizations.
You’ll shed stories you once held sacred.

And somewhere along the way, you’ll meet yourself —
not the version that pleases the world,
but the one that’s raw, real, and unafraid.

So if you’re feeling lost today,
if you’re still searching — maybe that’s part of the journey too.

Keep walking.
You’re not late.
You’re not behind.

You’re reaching your peace. Your freedom.
It’s not far away — it’s already here.
It’s now.

— Manohar Chimmani

Sunday, 5 October 2025

Back to What’s Real


No screen can ever replace the warmth of a real hug.
No emoji can carry the depth of a sincere smile.
No virtual world can mimic the wind in your hair, the smell of the sea breeze, or the sound of someone you love laughing beside you.

A mother’s touch, a friend’s sincere smile, the intimacy of love with your partner, the joy of your children’s laughter — these are sacred, living experiences. No AI, no gadget, no technology — now or in the future — will ever truly recreate them.

We are human beings, not just profiles or pixels.
We need each other — in person, offline, heart to heart.

Be you. Be true. Be real.
Put the phone down. Step outside. Look into someone’s eyes. Feel the world with all your senses again.

Life is a one-time offer.
Don’t spend it scrolling.
Live it. Touch it. Love it.

— Manohar Chimmani 

The Next Level Mindset


Satisfaction feels good — but it can also make you stop growing.

The moment you settle, your hunger fades, and life slowly becomes a loop of comfort. Growth begins where satisfaction ends.

Never stop chasing the next level — in wealth, in experience, in personal evolution.
Not out of greed, but out of the desire to explore your fullest potential.

Each level you reach is just a reminder that there’s more within you waiting to unfold.

Stay curious. Stay driven.
Because the real joy isn’t in reaching the top — it’s in climbing higher every day.

— Manohar Chimmani 

The Mirror Within


The way you see yourself shapes everything you attract.

If you see yourself as limited, life will reflect those limits back to you. But if you choose to think big — to see yourself as capable, worthy, and abundant — the world begins to rearrange itself to match that vision.

Perception of self is the seed of manifestation.
You can’t live a bigger life with a smaller self-image.

So, upgrade the way you see yourself.
Stand tall in your worth. Dream louder.

Because when you become more inside, life expands outside.

— Manohar Chimmani 

Saturday, 4 October 2025

Change the Environment, Change the Game


You either change your environment — or it changes you.
There’s no middle ground.

Your surroundings silently shape your habits, your thoughts, and eventually, your destiny.
If your environment pulls you down, no amount of motivation can lift you for long. But if it inspires you — every day becomes an opportunity.

When you can’t change yourself, look around. Maybe it’s not *you* that’s broken — maybe it’s the atmosphere that keeps you small.

Change the room, change the people, change the energy.
Because if you can’t change your environment, you can’t change your situation.

Mindset matters. But mindset grows best in the right soil.
Be positive, be authentic — but also, be tough.

Because greatness doesn’t bloom in comfort. It grows where courage takes root.

— Manohar Chimmani 

The Writing Ritual — Your Path to Freedom


Make writing a daily ritual.
Not a hobby. Not a side thing. A ritual.

Because when you sit down every day to write, you’re not just putting words on paper — you’re sharpening your mind, clarifying your thoughts, and reclaiming control over your own story.

Every sentence becomes an act of courage. Every page, a step closer to the freedom you once dreamed of.

Writing isn’t just expression; it’s healing, reflection, creation, and rebellion — all at once.
It’s your weapon to fight confusion, chaos, and mediocrity.

So, write daily. Write deeply.
Let your words shape the world around you — and the one inside you.

Because in the end, writing is not what you do.
It’s who you become.

— Manohar Chimmani 

Friday, 3 October 2025

చివరాఖరికి... మినిమలిజమ్!


ఒక రెండ్రోజుల అనారోగ్యం బోలెడంత స్ట్రెస్ పెంచింది. దాన్ని మించిన జ్ఞానోదయానికి తోడ్పడింది. 

ఎన్నెన్నో చెయ్యాలనుకుంటాం. కుదరదు. మనమీద ఎన్నో శక్తులు పనిచేస్తుంటాయి - ప్రత్యక్షంగా, పరోక్షంగా.

చాలాసార్లు చెయ్యగలిగినవి కూడా చెయ్యలేం. వంద కారణాలుంటాయి. 

ఒక ప్రొఫెషన్‌ను వదిలేసుకోవడం చాలా ఈజీ. కాని, కొత్తగా ఇటుక మీద ఇటుక పేరుస్తూ ఇంకో ప్రొఫెషన్ ప్రారంభించడం, అందులో ఆత్మవిశ్వాసంతో కొనసాగుతూ అనుకున్నది సాధించడం అంత ఈజీ కాదు. 

అంతకుముందు ప్రొఫెషన్లో జరిగిన భారీ రేంజ్ మనీ రొటేషన్, భారీ రేంజ్ మనీ అడ్జస్ట్‌మెంట్స్ ఇప్పుడుండవు. "ఆ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు లేదు... నేనందులో లేను" అని చెప్తే ఎవ్వడూ మనల్ని పట్టించుకోడు. దాన్లో ఉన్నప్పుడు కామ్‌గా ఉన్నవాళ్ళు కొందరు, దాన్ని వదిలేశానని తెలిసినప్పుడు విజృంభిస్తారు. ఏ ఒక్క పనీ కాదు. 

క్రియేటివిటీకి సంబంధించిన నేపథ్యంలో చాలామందికి ఇలాంటి స్టకప్‌లతోనే సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఇదంతా ఎవ్వరు పట్టించుకోరు... ఇంటాబయటా. 

అన్నీ నవ్వుతూ భరిస్తూ, ఎదుర్కొంటూ, ఏం జరగనట్టే ఉండాలి.      

ఇలాంటి నేపథ్యంలో సాధ్యమైనంత మానసిక వత్తిడి తగ్గించుకోడం చాలా అవసరం. తప్పనిసరి కూడా. 

మొన్న జులైలో అనుకున్నది ఇప్పుడు పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నాను...

మినిమలిజమ్.
ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా కూడా. 

ఒక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చాలు...
ఎక్స్‌కు ఫిక్స్ అయిపోయానిప్పుడు.   

నిజంగా ఏదైనా సాధించాలనుకొంటే, ఒక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చాలు. 

బ్లాగింగ్ కొనసాగిస్తున్నాను. దీన్ని మించిన స్ట్రెస్‌బస్టర్, స్నేహితురాలు నాకు ఇంకొకరు లేరు. దీన్ని మించిన థెరపీ కూడా లేదు. సో, నా బ్లాగ్ ఉంటుంది.     

కొత్త వ్యాపకాలు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయి కాబట్టి మొత్తం ఫోకస్ ఇంక వాటిమీదే. ఇంకేదీ నన్ను డిస్టర్బ్ చెయ్యకూడదు. సమయం వృధా కాకూడదు.  

జీవితం చాలా చిన్నది. అన్నీ మనమే చెయ్యాలనుకోవడం కన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అందరితోనూ పాజిటివ్‌గా బాగుండాలనుకోవడం కూడా మూర్ఖత్వమే.   

మంచి ఎనర్జెటిక్ టీమ్, మంచి పాజిటివ్ వాతావరణం మనచుట్టూ అవసరం. 

ఎవరు నిజంగా మనతో ప్రొఫెషనల్ జర్నీలో ఫోకస్డ్‌గా ఉండగలుగుతారు అన్నది మనమే డిసైడ్ చేసుకోవాలి. అనవసరంగా గుడ్డినమ్మకాలు, భ్రమలు పెట్టుకొని సమయం వృధాచేసుకోవద్దు. 

విన్-విన్, క్విడ్ ప్రోకో వంటివి వందకి వంద శాతం పాటించాలి.  

అనుభవాలు నేర్పిన గొప్ప పాఠాలు ఇవన్నీ.    

అందుకే ఈ మినిమలిజమ్. 

బరువులూ, బాధ్యతలూ, కమిట్మెంట్సూ... అన్నీ త్వరత్వరగా పూర్తిచేసుకోవడమొక్కటే లేజర్ ఫోకస్‌ కావాలి. మిగిలినవన్నీ ఉట్టి భ్రమ. ఒక్కొక్కటీ తగ్గిపోతూ అదృశ్యమవుతూవుండాలి.  

అంతిమంగా...
సర్వమ్ ఆధ్యాత్మికమ్.  

Life is short yet beautiful—fitness first, let go of the unwanted, and hold on to the few things that bring freedom and peace.

- మనోహర్ చిమ్మని  

Being Healthy Is the New Rich


We often chase money, status, and success. But without health, none of it matters.

Fitness comes first. Only when your body and mind are strong can you truly enjoy freedom in your profession, wealth from your work, and happiness with your family.

Every moment you live with energy, strength, and vitality is a rich moment.

Fitness is the foundation—it can make you or break you.

So choose wisely.
Be fit.
Be truly rich.

- Manohar Chimmani 

Thursday, 2 October 2025

సోషల్ మీడియా దసరా!


ఒకప్పుడు దసరా అంటే - సుమారు నెలరోజుల ముందు నుంచి మేం ఎదురుచూస్తూండేవాళ్లం. నా చిన్నప్పటి వరంగల్ జ్ఞాపకాల్లో దసరా కూడా ఒకటి. 

ఉర్సు గుట్ట, ఉర్సు చెరువు మా ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉండేవి. బతుకమ్మ పండుగ అక్కడే, దసరా అక్కడే. 

బెలూన్స్, లాయిలప్పాలు, పేపర్ ఫ్యాన్స్, టిక్టిక్కులు... ఎన్నో చిన్నపిల్లలు ఆడుకొనే ఆటవస్తువులు అప్పుడు 5 పైసలు, 10 పైసలే. 

వరంగల్లోని మొత్తం 2,3 వార్డుల జనం అంతా అక్కడికి లక్షల్లో వచ్చి పండగ చేసుకునేవారు. 

ప్రతి దసరా రోజు - ఎవరో ఒక వీఐపీ వచ్చి, అక్కడ రావణాసురుని పటాన్ని తుపాకీతో కాల్చటం, ఆ పటం పేపర్ ముక్కల్ని ఎగబడి కొందరు అందుకోవడం... అదంతా ఇప్పుడు లేదనుకుంటాను. 

బాణసంచాతో భారీ ఎత్తున చేసిన రావణాసురున్ని కాల్చడం అనేది నేను వరంగల్ వదిలిపెట్టి, హైద్రాబాద్ వచ్చిన రోజుల్లో వచ్చిన కొత్త పరిణామం. బహుశా ఇప్పుడు అదే కొనసాగుతుంటుంది.  

పండగ రోజు పొద్దున్నే పిండివంటలు, స్వీట్స్ ఇప్పుడు లేవు. మందు, నాన్-వెజ్ లేదు. వందలాది మంది కాదు... కనీసం అతి దగ్గరి బంధువులో కుటుంబసభ్యులో కలవటం అనేది కూడా ఇప్పుడు లేదు. 

ఇప్పుడు దసరా పండగ అంటే... జస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్తడం. ఎవరైనా ముఖ్యమైనవాళ్లకి వాట్సాప్‌లో గ్రీటింగ్స్ పంపించడం. మనకు ఎవరైనా గ్రీటింగ్స్ పంపిస్తే, సేమ్ టు యూ అంటూ తిరిగి గ్రీటింగ్స్ పంపడం. అంతే. 

మన సంస్కృతిని, మన సంప్రదాయాలను మనం కాపాడుకోలేని ఆధునికత, సాంకేతికతల్లో అసలు ఎటు కొట్టుకుపోతున్నాం మనం? 

When we forget our festivals and culture, we lose a part of ourselves as human beings—and with it, the connection to our own people.

- మనోహర్ చిమ్మని