Wednesday, 5 November 2025

నాకు కొన్ని చాదస్తపు ఆలోచనలున్నాయి...


అనుకోకుండా ఒకరోజు నేను యూట్యూబ్ ప్రారంభించాను, పాడ్‌కాస్ట్ చెయ్యాలని. 

ఇంటర్వ్యూల కోసం కెమెరాలు, టెక్నికల్ సెటప్, గెస్ట్స్ లిస్ట్, ఫండ్స్ గట్రా అన్నీ సెట్ చేసుకుని పూర్తిగా రెడీ అయ్యేదాకా ఖాళీగా ఎందుకని... నేనే సోలోగా చిన్న చిన్న వీడియోలు చెయ్యటం మొదలెట్టాను. నాక్కూడా ఈ "యూట్యూబింగ్" కాస్త అలవాటు అవ్వాలని. 

నాకిప్పటికీ ఆశ్చర్యమే, నిజంగా నేను యూట్యూబ్ చానెల్ ప్రారంభించానా అని. 

కట్ చేస్తే - 

నాకు కొన్ని చాదస్తపు ఆలోచనలున్నాయి...

అందరూ వీడియోలకు అలవాటుపడిపోయి, అసలు చదవటం అనేది దాదాపు పూర్తిగా మర్చిపోతున్నారని నా ఉద్దేశ్యం.

ఈ యూట్యూబ్ వీడియోల వల్ల బుక్స్, ఆర్టికిల్స్ వంటివి చదువుతుంటే వచ్చే పాజిటివ్ ఆలోచనలు, విజువలైజేషన్ వంటివి బాగా తగ్గిపోతున్నాయని, క్రమంగా మన మెదడుకి అసలు పనే లేకుండా చేస్తున్నామన్నది నా బాధ.    

ఈ ఒక్క కారణం వల్లే యూట్యూబ్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. 

ఇక, యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించటం అన్నది కూడా ఎప్పుడూ నా ఆలోచనలో లేదు.  

ఏదైనా ఒక అంశం మీద నేను ఇంటర్నెట్లో వెతుకుతున్నప్పుడు వీడియో, టెక్స్‌ట్ ఆర్టికిల్ రెండూ నాకు కనిపిస్తే, వాటిల్లో నేను ఆర్టికిల్ చదవడానికే ఇష్టపడతాను. 

అలాంటిది - నేను యూట్యూబ్ చానెల్ ప్రారంభించానా అని ఇప్పటికీ అనుమానమే నాకు. 

కట్ చేస్తే - 

నేను సోలో వీడియోలు చేయడం కూడా ఇప్పుడు నాకు బోర్ కొట్టేసింది. ఏ క్షణమైనా ఆపేస్తాను.

నా అసలు లక్ష్యం... నా పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలు. 

వాటిని నేను ఎప్పుడు మొదలెడతాను అన్నదే ప్రస్తుతం నాముందున్న ప్రశ్న.

పాడ్‌కాస్ట్ అయినా, సోలో వీడియోలైనా, ఇంకొకరి మీద ఆధారపడని స్థితిలోనే చెయ్యాలన్నది నా స్థిరమైన ఆలోచన.  

Routine kills creativity. Curiosity keeps it alive. Wake up hungry for the next idea, the next frame, the next win.

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani