మనకున్న 24 గంటల్లో మనం ఏమీ చేయం. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాం. అసలు ఏదైనా ఎందుకని చెయాలి అని అనుకుంటాం.
లేదంటే - "అంతా అయిపోయింది, ఇప్పుడేం చేస్తాంలే" అని మనకి మనం సర్దిచెప్పుకుంటాం. సమర్థించుకుంటాం.
లేదంటే - "అంతా అయిపోయింది, ఇప్పుడేం చేస్తాంలే" అని మనకి మనం సర్దిచెప్పుకుంటాం. సమర్థించుకుంటాం.
95 శాతం మంది విషయంలో జరిగేది ఇదే. ఒక్క 5 శాతం మంది మాత్రమే తమకున్న 24 గంటల్ని నిజంగా సద్వినియోగం చేసుకుంటారు.
కట్ చేస్తే -
కట్ చేస్తే -
1901 లో పుట్టిన ఈ బ్రిటిష్ నావెలిస్ట్ జీవితం నిండా రికార్డులే రికార్డులు...
బార్బరా కార్ట్‌లాండ్ తన జీవిత కాలంలో మొత్తం 723 నవలలు రాసింది. అన్నీ పబ్లిష్ అయ్యాయి.
1976 లో, ఆ ఒక్క సంవత్సరంలోనే పబ్లిష్ అయిన బార్బరా నవలల సంఖ్య 23. అంటే నెలకి 2 నవలలు ఆమె రాసింది.
అప్పుడు బార్బరా వయస్సు 82.
బార్బరా తన చివరి నవల తన 97 వ ఏట రాసింది. 98 లో చనిపోయింది.
ఆమె చనిపోయేనాటికి ఇంకో 160 నవలలు పబ్లిష్ కావడానికి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా మొన్న 2018 వరకు పబ్లిష్ చెయ్యటం పూర్తిచేశారు.
అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం బార్బరా నవలలు సుమారు 750 మిలియన్ల కాపీలు సేలయ్యాయి.
అంటే - సుమారు 75 కోట్ల కాపీలు!
అంటే - సుమారు 75 కోట్ల కాపీలు!
ఇంకొక అంచనా ప్రకారం బార్బరా నవలలు దాదాపు 2 బిలియన్ల కాపీలు సేలయ్యాయి. అంటే సుమారు 200 కోట్ల కాపీలు సేలయ్యాయన్నమాట!!
బార్బరా రచయిత్రి మాత్రమే కాదు, బిజినెస్ వుమన్ కూడా. "కార్ట్‌లాండ్ ప్రమోషన్స్" పేరుతో బిజినెస్ కూడా చేసింది బార్బరా.
రచనలు చేస్తూనే పొలిటీషియన్‌గా (కన్సర్వేటివ్ పార్టీ కౌన్సిలర్) 9 సంవత్సరాలు పనిచేసింది.
సంగీతంలో కూడా ప్రేమ గీతాలతో ఒక 'ఈపీ' రికార్డ్ చేసింది బార్బరా.
సంగీతంలో కూడా ప్రేమ గీతాలతో ఒక 'ఈపీ' రికార్డ్ చేసింది బార్బరా.
బార్బరా కార్ట్‌లాండ్ జీవితం మీద "ఇన్ లవ్ విత్ బార్బరా" అని ఒక డాక్యుమెంటరీ కూడా చేసింది బీబీసీ.
కట్ చేస్తే -
బార్బరా రాసినవన్నీ రొమాంటిక్ నవలలే. మన యద్ధనపూడి సులోచనా రాణి లాగా అన్నమాట.
ఎంత రొటీన్ ప్రేమనవలలైనా, ఒక స్టాండర్డ్ లేకుండా, చదివించే గుణం లేకుండా పబ్లిష్ అవ్వవు కదా? అంతలా సేల్ కావు కదా?
ఇక్కడ మనం గుర్తించాల్సిన పాయింట్ ఒకటి ఏంటంటే - బార్బరా రాసిన 723+160 నవలల్లో ఎంత రొటీన్ ప్రేమికులున్నా... వారికి ప్రతి నవలలోనూ ఒక కొత్త సమస్య క్రియేట్ చెయ్యాలి. పాఠకుల్ని ఒప్పించాలి.
అదే క్రియేటివిటీ.
అదే క్రియేటివిటీ.
ఆ విషయంలో బార్బరా సక్సెస్ అయ్యింది కాబట్టే అన్ని నవలలు రాయగలిగింది.
మనమున్నాం ఎందుకు?
అందరం నవలలు రాయాలనే కాదు.
కాని, ఒక రోజులో మనకున్న 24 గంటల్ని ఎంతవరకు మనం సద్వినియోగం చేసుకుంటున్నాం... మనకున్న ఒకే ఒక్క జీవితాన్ని ఎంత బాగా అనుభవిస్తున్నాం అన్నది... నిజంగా మిలియన్ డాలర్ కొశ్చన్!
ఏమంటావ్ ప్రదీప్?
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani