ఇంకో 36 రోజులైతే న్యూ ఇయర్ 2026 వస్తుంది. అసలిప్పటిదాకా, ఈ 11 నెలల్లో ఈ సంవత్సరం ఏం సాధించాను?
2025 లోనే కాదు. అసలు మొత్తం నా జీవితంలో నేనేం సాధించాను?
2025 లోనే కాదు. అసలు మొత్తం నా జీవితంలో నేనేం సాధించాను?
సంపూర్ణ అంతర్విశ్లేషణ చేసుకోవాల్సిన రోజు ఇది.
ఇప్పుడదే చేస్తున్నాను.
ఇప్పుడదే చేస్తున్నాను.
కట్ చేస్తే -
ఇప్పటిదాకా కుటుంబం కోసం, పిల్లల కోసం ఆలోచించాను. కష్టపడ్డాను. ఇప్పుడు పూర్తిగా నాకోసం నేను ఆలోచిస్తున్నాను. నాకోసం నేను పనిచేస్తున్నాను.
జీవితం ఒక్కటే.
ఇప్పుడు దాన్ని సంపూర్ణంగా జీవించడానికి కమిట్ అయ్యాను.
నా జీవితం నేను జీవిస్తున్నాను.
బిగ్ మనీ రొటేషన్ కోసం నా సినిమా ప్రొఫెషన్ ఒక టూల్ మాత్రమే. రైటింగ్ మాత్రం నా ఫస్ట్ ప్యాషన్. ఈ రెండిటికీ 50-50 సమయం కెటాయిస్తున్నాను.
ఇదే సమయంలో - నాకెంతో ఇష్టమైన స్పిరిచువాలిటీ దిశగా కూడా ఇప్పుడు నా ప్రయాణం కొనసాగుతోంది.
For a true creative, there is no personal life or professional life — only one continuous creative life where work is joy and joy becomes work. And within that flow, I’m also walking my deepest path — my passion for Spirituality.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani