ఈ న్యూస్‌ని ఎంతమంది నాకు ఫార్వార్డ్ చేశారో చెప్పలేను.
వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, తీస్తే సినిమా అలా తీయాలి అని.
ఇంకొందరు ఓటీటీలో కొన్ని మలయాళం సినిమాలు చూసి లింక్ పంపిస్తుంటారు. వాళ్ళ ఉద్దేశ్యం కూడా అదే... సినిమా తీస్తే అలా మలయాళం సినిమాల్లా తీయాలి అని.
కట్ చేస్తే -
పైన చెప్పిన లాంటి సినిమాలు తెలుగులో ఎందరో ఎన్నెన్నో తీశారు. ఒక్కడు థియేటర్‌కు వెళ్ళి సినిమా చూళ్ళేదు. అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఒక్క పైసా రాలేదు.
అతికొద్దిమంది రివ్యూయర్స్, మేధావులు మాత్రం సూపర్ అంటూ కితాబులిచ్చారు.
నీతి ఏంటంటే... ఇలా నీతులు చెప్పేవాళ్ళెవ్వరూ సినిమాలు చేయలేరు. సినిమాలు చేసేవాళ్ళెవ్వరూ ఈ నీతుల్ని పట్టించుకోరు.
- మనోహర్ చిమ్మని
.jpg)
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani