Tuesday, 4 November 2025

నిజంగా అందరూ హైద్రాబాద్‌లోనే ఉండాల్సిన అవసరం ఉందా?


అసలిక్కడ ఏం పనిలేనప్పుడు - "హైద్రాబాద్‌లోనే ఉండాల్సిన అవసరం లేదు" అనిపిస్తోంది నాకు. ఏదైనా పనున్నప్పుడు, ఆ నాలుగైదు రోజులు హైద్రాబాద్ వచ్చిపోవచ్చు.  

ట్రాఫిక్ సమస్య లేని, ఖర్చు తక్కువయ్యే, ఏదైనా ప్రశాంతమైన సెకండ్ లెవెల్ సిటీకో, దూరంగా పాండిచ్చేరి లాంటి సముద్రం ఉన్నచోటకో మారాలనిపిస్తోంది. 

ఇదొక కొత్త వైబ్.  

కట్ చేస్తే - 

గత నాలుగైదు రోజుల్లో, సిటీ మధ్యలోనే నా కారు/క్యాబ్ ట్రావెల్ అంత దారుణంగా ఉంది. 

సిటీలోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కు పోవడానికి సుమారు రెండు నుంచి రెండున్నర గంటలు పట్టింది. ఇలా దాదాపు రెగ్యులర్‌గా జరుగుతోంది. 

ఇక్కడ మనకు ప్రతిరోజూ పనిలేనప్పుడు, తప్పనిసరిగా ఇక్కడే ఉండాల్సిన అవసరం లేనప్పుడు, ఇక్కడే ఇంత రద్దీలో ఉండాల్సిన అవసరం లేదు. 

నాకు తెలిసిన కొందరు రైటర్స్ ఎక్కువగా డెహ్రాడూన్ లాంటి హిల్ స్టేషన్స్‌లోనో, సముద్రం ఉన్న పాండిచ్చేరి, గోవా లాంటి ప్రదేశాల్లోనో సెటిల్ అయ్యారు. బాగా రచనలు చేశారు. తొంభై ఏళ్ళకుపైగా జీవించి ఆరోగ్యంగా కూడా ఉన్నారు. 

అరట్టై సృష్టికర్త, జోహో అధినేత శ్రీధర్ వెంబుకు 50,000 ల కోట్ల ఆస్తులున్నా, ఎక్కడో చెన్నైకి 650 కిలోమీటర్ల దూరంలో, పొల్యూషన్-ఫ్రీ టెన్‌కాశిలో ఉంటున్నాడు. టెన్‌కాశి నుంచే అతని కార్పొరేట్ కంపెనీ వ్యవహారాలు చూస్తున్నాడు.

నలభై ఏళ్ళుగా శ్రీధర్ వెంబును బాధపెట్టిన ఆస్తమా జబ్బు, టెన్‌కాశిలోని ప్రశాంతమైన సహజ వాతావరణంలో ఎలాంటి మందుల అవసరం లేకుండానే మాయమైపోయింది.       

ఇదేదో కొంచెం సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయమే. 

Where you live, what you do, and who you’re around — these three define your life. And for creative people, where you live changes everything.

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani