నిజానికి రిత్విక్ ఘటక్ గురించి, ఆయన సినిమా వ్యామోహం గురించి ఇప్పటికిప్పుడు నాకు గుర్తున్న విషయాలే ఒక ఇరవై పేజీలు రాయగలను. కాని, ఎవరికోసం రాయాలి అన్నది ఒక పెద్ద ప్రశ్న.
ఓయూ "ఏ" హాస్టల్లో దూరదర్శన్ ఆదివారం రీజనల్ సినిమా చంక్‌లో, హైద్రాబాద్ ఫిలిం క్లబ్ ప్రదర్శనల్లో, మాక్స్‌ముల్లర్ భవన్లో, ముంబైలో ఒక ఫ్రెండ్ వీడియో లైబ్రరీలో... రిత్విక్ ఘటక్ సినిమాలు కొన్ని నేను చూశాను.
అప్పట్లో నా ఓయూ మిత్రుడు గుడిపాటితో కలిసి కూడా రిత్విక్ ఘటక్ సినిమాలు కొన్ని చూశాను.

రిత్విక్ ఘటక్ విషయంలో నాకు అత్యంత బాధాకరంగా అనిపించే విషయం ఒక్కటే...
రిత్విక్ తొలి సినిమా "నాగరిక్" 1952లో తీశాడు. ఫెస్టివల్స్‌లో ప్రశంసలు పొందిన ఆ సినిమా, పాతికేళ్ళ తర్వాత ఆయన మరణానంతరం మాత్రమే విడుదలకు నోచుకొంది.
మన దేశంలో ఆర్ట్ సినిమాల పరిస్థితి అప్పట్లోనే అలా ఉంది. ఇప్పటి పరిస్థితి చెప్పడానికి ఏం మిగల్లేదు.
ఒక నికార్సయిన కమ్యూనిస్టుగా రిత్విక్ సినిమాల్లో సామాన్య మానవుడు, అతని కష్టాలే సబ్జెక్టుగా ఉండేవి.
"అజంత్రిక్" నుంచి "నాగరిక్" వరకు దాదాపు 8 సినిమాలను రచించి దర్శకత్వం వహించిన రిత్విక్... నటుడు, స్క్రిప్ట్ రైటర్, డాక్యుమెంటరీ ఫిలిమ్మేకర్ కూడా. షార్ట్ ఫిలిమ్స్ కూడా చాలా తీశాడు.
థియేటర్ కోసం కూడా రిత్విక్ చాలా స్క్రిప్టులు రాశాడు. నటించాడు, డైరెక్ట్ చేశాడు కూడా.
పూనే ఫిలిం ఇన్‌స్టిట్యూట్లో రిత్విక్ బోధించినట్టు కూడా చదివిన గుర్తుంది.
ఇక, రిత్విక్ ఘటక్ పూర్తిచేయని సినిమాలు కనీసం ఒక అరడజన్ ఉంటాయి. వాటి అతీగతీ ఎవ్వరికీ తెలీదు.
నాకు గుర్తున్నంత వరకు రిత్విక్ అంటే అర్థం - వేదాలు చదువుకున్నవాడు అని. అర్థం సంగతి ఎలా ఉన్నా, "రిత్విక్" పేరు నాకు చాలా ఇష్టం.
మా గుడిపాటికి ఆర్ట్ సినిమా దర్శకుల్లో రిత్విక్ ఘటక్ అంటే పిచ్చి అభిమానం ఉండేది. బహుశా, ఇప్పటికీ అలానే ఉండివుంటుంది.

కట్ చేస్తే -
రిత్విక్ 1952లో తీసిన తన తొలి సినిమా "నాగరిక్" తర్వాత మూడేళ్ళకు సత్యజిత్ రే "పథే పాంచాలి" వచ్చింది. నాగరిక్ ముందే రిలీజ్ అయ్యుంటే భారతీయ ఆర్ట్ సినిమా చరిత్రలో పేజీలు మరొకరకంగా లిఖించబడి ఉండేవని కొందరంటారు. నిజమే అనిపిస్తుంది నాకు.
అయితే - ఇది పోలిక కాదు. కొన్ని కళాత్మక సంఘటనల సమయం కూడా చరిత్రను ఎలా ప్రభావితం చేసే వీలుందో చెప్పడం. అంతే.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani