100CR Mission.
సుమారు 2 నుంచి 5 కోట్లు బడ్జెట్ అంటే చిన్న బడ్జెట్ అన్నమాట. ఇప్పుడు ఈ చిన్న బడ్జెట్ సినిమాలే రిస్క్-ఫ్రీ.
మీరు గమనించారా... దాదాపు ప్రతి పెద్ద ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు కూడా రెగ్యులర్‌గా చేస్తోందని?
ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే, ఇంకోవైపు చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. లేదంటే, బయటి నుంచి ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ చేసిన చిన్న బడ్జెట్ సినిమాల్ని, పెద్ద నిర్మాతలు తీసుకొని, వాళ్ళ బ్యానర్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.
ఎందుకు?
రొటేషన్.
భారీ సినిమాలు ఎప్పుడు పూర్తయ్యి, ఎప్పుడు రిలీజ్ అవుతాయో అస్పష్టం. ఈలోగా చిన్న రేంజ్‌లో అయినా మనీ రొటేషన్ కావాలంటే చిన్న సినిమాలే కాపాడతాయి.
భారీ బడ్జెట్ సినిమాలు గ్యాంబ్లింగ్ అయితే,
చిన్న బడ్జెట్ సినిమాలు రిస్క్-ఫ్రీ.
చిన్న బడ్జెట్ సినిమాలు రిస్క్-ఫ్రీ.
భారీ బడ్జెట్ సినిమాల్లో పోతే పదులు-వందల కోట్లు పోతాయి. చిన్న సినిమాలు ఫ్లాప్ అయినా, ఓటీటీలు ఇతర రైట్స్ ద్వారా మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. ఎంతో కొంత లాభం కూడా తప్పకుండా వస్తుంది. ఎందుకంటే, బడ్జెట్ తక్కువ కాబట్టి.
ఇప్పుడు నేను ఈ ఒక్క టార్గెట్‌తోనే ముందుకు వెళ్తున్నాను... చిన్న బడ్జెట్ సినిమాతోనే 100 కోట్ల హిట్ కొట్టాలని.
And... This is my 100CR Mission.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani