అయిదురోజుల ఆటయినా సరే, గతంలో టెస్ట్ క్రికెట్ అంటే అదో క్రేజ్. తర్వాత కొంతకాలం వన్-డే లు రాజ్యమేలాయి. ఉన్నట్టుండి 20-20 ఎంటరయ్యింది. అసలు ఆటే మారిపోయింది!
ఒక్క క్రికెట్ లోనే కాదు. ఈ వేగం దాదాపు ప్రతి ఫీల్డు లోనూ వచ్చింది. మనిషి జీవితంలోనూ వచ్చింది.
అలా వచ్చేలా చేసింది ఇప్పటి మన ఆధునిక జీవనశైలి.
టైం లేదు... వేగం... తెలియనిది ఇంకేదో కొత్తది కావాలన్న తపన. అది కూడా త్వరగా అయిపోవాలి. ఫాస్ట్ ఫుడ్ లాగా అందరికీ ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి.
కట్ చేస్తే -
ఒకప్పుడు సినిమా తీయడం అంటే అదొక మహా యజ్ఞం. షూటింగ్ చూడటం ఓ గొప్ప విషయం. సినిమా యాక్టర్లు, డైరెక్టర్లు కనిపించినా అదో సంచలనం.
ఇప్పుడదంతా గతం.
సంవత్సరానికి ఒకటో రెండో వచ్చే వందల కోట్ల భారీ బడ్జెట్ ప్యానిండియా సినిమాలను వదిలేయండి. ఈ సినిమాల సంఖ్య చాల తక్కువ. అది మన సబ్జెక్ట్ కాదు. అక్కడ బయటికి కనిపించేదంతా కూడా నిజం కాదు. ఆ టాపిక్ ఇంకోసారి చర్చిద్దాం.
ఫిలిం మేకింగ్ టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ఫిలిం మేకింగ్ శైలి, పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు సినిమాలు వేరు. ఇంతకుముందు సినిమాలు వేరు.
Content is the king. Money is the ultimate goal.
స్క్రిప్ట్, డబ్బు రెడీ గా ఉంటే చాలు. కేవలం 90 రోజుల్లో ఒక మార్కెటేబుల్ సినిమాని పూర్తిచేసి, రిలీజ్ చేయగల సౌకర్యాలు వచ్చాయి. అలా చేస్తున్నారు కూడా. జస్ట్... ఒక సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌తోనే మార్కెటింగ్, బిజినెస్ అన్నీ చేసేయొచ్చు.
Ideas are the currency of the 21st century.
ఇప్పుడు ఎవరైనా సరే, చిన్న బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ సినిమా చేయొచ్చు. మనం క్రియేట్ చేసే మార్కెట్‌ను బట్టి థియేటర్స్‌లో, ఓటీటీల్లో రిలీజ్ చేయొచ్చు.
సినిమా అనేది ఇప్పుడు ఒక క్రియేటివ్ బిజినెస్ మాత్రమే కాదు. పక్కా కార్పొరేట్ బిజినెస్. ఇంతకు ముందులాగా "హెవీ గాంబ్లింగ్" కాదు.
ఫిలిం ఆర్ట్ పైన, మార్కెట్ పైన, బిజినెస్ పైన కనీస అవగాహన ముఖ్యం. ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూవుండటం, కొత్త గ్యాప్స్ ఫిలప్ చేసుకుంటూవెళ్ళటం ముఖ్యం.
ఇంకా చెప్పాలంటే - ఇప్పుడు హిట్టా, ఫట్టా అన్నది కూడా కాదు ముఖ్యం. ఆట ముఖ్యం. ఆటలో ఉండటం ముఖ్యం. ఆటలో మజా ముఖ్యం. సినిమాల్లో డబ్బు రకరకాల రూపాల్లో అదే మనల్ని ఫాలో అవుతుంది. ఎవరికీ నష్టం ఉండదు.
ఇదే ఇప్పటి ట్వంటీ ట్వంటీ ఫిలింమేకింగ్! దీన్నే నేను "రెనగేడ్ ఫిలిం మేకింగ్" అంటున్నాను. దీనికి రూల్స్ ఉండవు. ఉన్న రూల్స్ ఫాలో అవ్వము.
టాలెంట్, ప్యాషన్, సాధించాలన్న కసి నిజంగా ఉన్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కు కూడా అవకాశం ఇస్తాం. ప్రూవ్ చేసుకోండి. పేరూ, డబ్బూ బాగా సంపాదించుకోండి.
మంచి కంటెంట్‌తో సెన్సేషనల్ బజ్ క్రియేట్ చెయ్యటం. బాగా డబ్బు సంపాదించుకోడం. అదే సినిమా. డబ్బే... ఇంకేం లేదు. అన్నీ అవే ఫాలో అవుతాయి.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 4/100.
100 Days, 100 Posts. 4/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani