మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే - సినిమాలు ఓటీటీల మీద వచ్చే ఆదాయం మీద ఆధారపడ్డాయి గాని, ఓటీటీలు కేవలం సినిమాల మీదే ఆధరపడలేదు.
ఓటీటీల నుంచి డబ్బులు బాగా వస్తున్నాయి కదా, మా సినిమాలో ఉన్నది స్టార్ హీరో కదా అన్న ఈగోలకు ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ పడింది.
స్టార్ హీరో సినిమా అయినా, చిన్న సినిమా అయినా... టీజర్లు, ట్రయలర్లు వచ్చి, రిలీజ్‌కు ముందు వాటి బజ్ చూశాకనే ఓటీటీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయి.
సో, స్టార్ హీరోలున్న సినిమాలకే ఓటీటీలు ముందు డీల్ ఓకే చేస్తాయి అన్న మిత్‌కు ఇప్పుడు పూర్తిగా తెరపడింది.
అతి తక్కువ సమయంలో ఓటీటీ బిజినెస్‌లో ఇలాంటి భారీ మార్పు రావడానికి కారం కూడా సినిమావాళ్లే. వారి అత్యాశే. వారి ఈగోనే.
కాని, "కంటెంట్ ఈజ్ ద కింగ్" అన్న విషయాన్ని లైట్ తీసుకోవడమే.
కాని, "కంటెంట్ ఈజ్ ద కింగ్" అన్న విషయాన్ని లైట్ తీసుకోవడమే.
ఓటీటీ రేటు బాగా వస్తుంది కదా అని హీరోలు రెమ్యూనరేషన్స్ పెంచడం, ప్రొడ్యూసర్స్-డైరెక్టర్స్ అంతకంతకూ అర్థంలేకుండా సినిమాల బడ్జెట్స్ పెంచుకుంటూపోతుండటం అనేది... చివరికి బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపుకుతిన్నట్టయింది.
అంతకు ముందు శాటిలైట్ రైట్స్ వచ్చినప్పుడు కూడా అంతే... ఆ బిజినెస్‌లోని ప్రతిచిన్న లూప్‌హోల్‌నూ వాడుకొని, అసలు కంటెంట్ లేని సినిమాలను వందలకు వందలు తీసి, శాటిలైట్ రైట్స్ అమ్ముకోవడం ద్వారానే కోట్లు గడించారు.
ఇందాకే చెప్పినట్టు - ఓటీటీలకు ప్రేక్షకులున్నారు. కంటెంట్ కావల్సినంత ఉంది. వెబ్ సీరీస్‌లు, ఒరిజినల్స్ రూపంలో కొత్త కంటెంట్ వాళ్లే సొంతంగా క్రియేట్ చేసుకొంటున్నారు.
సినిమాలు వాళ్లకిప్పుడు ఒక ఆప్షన్ మాత్రమే.
కట్ చేస్తే -
కొత్త టాలెంట్‌తో, ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మంచి కంటెంట్‌ను క్రియేట్ చేసే చిన్న బడ్జెట్ ఇండిపెండెంట్ సినిమాలకు ఎలాంటి సమస్య ఉండదు.
ఇది దశాబ్దాలుగా - అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ప్రూవ్ అవుతూనే ఉంది. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారా సినిమా ఎక్కడికో పోతుంది. ఏ నాన్-థియేటర్ రైట్స్ అయినా తర్వాత ఎలాగూ వెంటబడి వస్తాయి.
కాని, ఎవరు వింటారు?
- మనోహర్ చిమ్మని
(100 Days. 100 Posts. 1/100.)
(100 Days. 100 Posts. 1/100.)
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani