పాత ఆదిలాబాద్ జిల్లా.
నిర్మల్ దగ్గర పార్పెల్లి గ్రామం.
పదో తరగతి ఎలాగో పాసయ్యాడు.
ఇంక చదువు తనవల్ల కాదనుకున్నాడు.
ఇంటర్‌లో చదువు డిస్కంటిన్యూ చేశాడు.
కట్ చేస్తే -
హైద్రాబాద్‌లో మొట్టమొదటి డిజిటల్ కెమెరామన్, వెండి మబ్బులు సినిమా, రుతురాగాలు, చక్రవాకం వంటి మాగ్నం-ఓపస్ సీరియళ్ళకు కెమెరామన్ అయిన పోతన రమణ దగ్గర అసిస్టెంట్‌గా చేరిపోయాడా యువకుడు.
కొన్నాళ్ళ తర్వాత దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ స్టూడియోల్లో ఒకటైన డిజిక్వెస్ట్‌లో ఉద్యోగంలో చేరాడు.
కట్ చేస్తే -
బెంగుళూరు, ముంబై, కొచ్చి, హైద్రాబాద్ డిజిక్వెస్ట్ బ్రాంచ్‌ల మధ్య కెమెరాలతో ఫ్లయిట్ ప్రయాణాలు, షూటింగులు. అలా ముంబైలో పనిచేస్తున్నప్పుడే రిషి పంజాబి వటి యాడ్ ఫిలిం మేకర్స్‌తో కూడా పనిచేశాడా యువకుడు.
డిజిక్వెస్ట్‌లో పనిచేస్తున్నప్పుడే నా రొమాంటిక్ హారర్ సినిమా "స్విమ్మింగ్‌పూల్"కు కెమెరా డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడానికి వచ్చి, అప్పుడు నాకు మొదటిసారిగా పరిచయమయ్యాడా యువకుడు.
అప్పటినుంచీ మధ్య మధ్య కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. మొన్నీ మధ్యనే మా స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ఆఫీసులో కూడా కలుసుకున్నాము. తర్వాత మళ్ళీ మొన్నటి రోడ్-క్రైమ్-థ్రిల్లర్ "ఎర్ర గులాబి" సినిమా షూటింగ్‌లోనే మేం కలవడం.
అయితే - ఈ సారి, కెమెరా అసిస్టెంటుగానో అసిస్టెంట్ కెమెరామన్‌గా మాత్రమే రాలేదతను. టాలీవుడ్‌లో కెమెరాలను షూటింగ్ కోసం రెంటుకిచ్చే "స్కంద ఫిలిం గేర్స్" పార్టనర్‌గా కూడా వచ్చాడు. మా డిఓపి వీరేంద్రలలిత్‌తో, నాతో కలిసి అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా ఎప్పట్లాగే మా టీమ్‌లో పనిచేశాడా యువకుడు.
ఆ యువకుని పేరు... అశోక్ రెడ్డి.
కట్ చేస్తే -
కట్ చేస్తే -
అశోక్ రెడ్డి ఇప్పటికే ఒక తమిళ సినిమాకు, 2 తెలుగు సినిమాలకు ఇండిపెండెంట్ డిఓపిగా పనిచేశాడు. డైరెక్టర్ రవిబాబుతో కూడా ఒక సినిమా చేశాడు. ఇకమీదట డిఓపి గానే కొనాసాగాలనుకుంటున్నాడు.
నాకున్న సమాచారం ప్రకారం, తన పర్సనల్ లైఫ్‌లో వచ్చిన ఒక పెద్ద డిస్టర్బెన్స్ వల్ల అశోక్ రెడ్డి కెరీర్‌లో కొన్ని ఒడిదొడుకులు వచ్చాయి గాని, లేదంటే ఇప్పటికే టాలీవుడ్‌లో సినిమాటోగ్రాఫర్‌గా ఒక స్థాయికి రీచ్ అయ్యి, చాలా బిజీగా ఉండేవాడు.
తెలంగాణలో అసలు ఎలాంటి డెవలప్‌మెంట్‌కు నోచుకోని ఆదిలాబాద్ జిల్లా (ఇప్పుడు నిర్మల్ జిల్లా) నుంచి 2005 లోనే ఒక కుర్రాడు సినిఫీల్డులోకి వచ్చి, ఈ స్థాయికి ఎదగడం అన్నది నిజంగా నేను ఊహించని విషయం.
వ్యక్తిగతంగా చాలా మంచివాడు, సౌమ్యుడు అయిన అశోక్ రెడ్డి నాకు పదేళ్ళ క్రితం మొదటిసారి పరిచయం అయినప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడూ అలాగే ఉన్నాడు. ఇండస్ట్రీలో ఇది చాలా అరుదు. ఒక్క సినిమా చేస్తారో లేదో... ఒక్కొక్కరు ఎలా యాటిట్యూడ్ లెవల్స్ చూపిస్తారో మనకు తెలుసు. అశోక్ రెడ్డిలో అలాంటిదేం లేకపోవడం నిజంగా గొప్ప విషయం.
ఫినిషింగ్ టచ్ ఏంటంటే -
త్వరలో మా ఇద్దరి కోంబోలో ఒక సినిమా ఉండబోతోంది. స్క్రిప్ట్ వర్క్, ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. టైటిల్ కూడా మొన్నీమధ్యే రిజిస్టర్ అయింది...
"Warangal Vibes!"
A dark romantic crime comedy.
"Warangal Vibes!"
A dark romantic crime comedy.
Wishing Ashok Reddy a remarkable journey and a shining career as a DOP in the film industry!
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani