ఇప్పుడు ఫీల్డులో ఉన్న ప్రొడ్యూసర్స్ ఒక్కొక్కరి దగ్గర కనీసం ఒక అరడజన్ మంది డైరెక్టర్స్ క్యూలో ఉంటారు. అరడజన్ ప్రాజెక్టులు లైన్లో ఉంటాయి. అలాంటి సిచువేషన్లో, ఇంక ప్రతి ఒక్క డైరెక్టర్ వెళ్ళి అదే లైన్లోనే నిల్చుని, "నేను కూడా కథ చెప్తాను, ఒప్పిస్తాను" అనుకోవటం అంత ఫూలిష్‌నెస్ ఇంకోటి ఉండదు.
కాని, మనం కూడా సినిమా చేయాలి. ట్రాక్‌లో ఉండాలి.
ఎలా?
ఎలా అంటే... ఇందులో అంత న్యూక్లియర్ సైన్స్ ఏం లేదు. మన ప్రొడ్యూసర్స్‌ను మనమే క్రియేట్ చేసుకోవాలి. మన ఇన్వెస్టర్స్‌ను మనమే చూసుకోవాలి. ఇది మామూలుగా అందరు చేసేదే. తెలీనివారికే కొంచెం కొత్తగా, వింతగా ఉంటుంది.
Create your own producer and start your film. That's it.
కట్ చేస్తే -
ఈమధ్య చాలామంది ఒక రొటీన్ మాట చెప్తున్నారు, "మార్కెట్లో అసలు మనీ లేదు" అని! ఇలాంటి మాట నేను చిన్నప్పట్నుంచి వింటున్నాను.
అప్పుడు తెలుగులో సంవత్సరానికి 100 సినిమాలు తయారయ్యేవి. ఇప్పుడు 200 తయారవుతున్నాయి! మరి మార్కెట్లో మనీ లేకుండా ఇన్ని సినిమాలు ఎలా తయారవుతున్నాయి?
ఈమధ్య ఇంకో కొత్త పాట పాడుతున్నారు చాలామంది... "రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది. మనీ ఫ్లో అసల్లేదు" అని.
నిజమే కావచ్చు. కాని, దీనికి కూడా నా హంబుల్ కొశ్చన్ సేమ్...
మనీ ఫ్లో లేకుండానే అందరూ బంగారం కొంటున్నారు, కార్లు కొంటున్నారు. మన టాలీవుడ్లో ఎప్పట్లాగే 200+ సినిమాలు తయారవుతున్నాయి.
మార్కెట్ లేని హీరో సినిమా అయినా సరే... 60-70 కోట్లు పెడుతున్నారు. కొత్తవాళ్లతో తీసే సినిమాలకైతే 5-6 కోట్లు అనేది ఇప్పుడొక చిన్న స్టార్టప్ లెవెల్ అయిపోయింది. ఇక పెద్ద హీరోల సినిమాలకైతే 400 నుంచి 700, 1000 కోట్లదాకా కూడా పోతోంది బడ్జెట్.
నిజంగా మార్కెట్లో మనీ ఫ్లో లేకుండా ఇదంతా ఎలా సాధ్యం?
అదే నాకర్థం కావటం లేదు...
Whatever hits, whatever hurts… the damn show must go on. Create your own producer. Start your film. Period.
అదే నాకర్థం కావటం లేదు...
Whatever hits, whatever hurts… the damn show must go on. Create your own producer. Start your film. Period.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani