ఈ మూడు లేకుండా మన దేశంలో సగటు మనుషులు బ్రతకలేరు. వీటిలో మొదటి రెండు రంగాల వాళ్లకు మూడోరంగం అంటే మంచి క్రేజ్. వాళ్లూ వీళ్లూ మంచి రిలేషన్‌షిప్స్ కూడా మెయింటేన్ చేస్తుంటారు.
ఇక 'ఫిలిం బేస్డ్' ప్రోగ్రామ్స్ లేకుండా టీవీ చానెల్స్ బ్రతకలేవు. న్యూస్‌పేపర్స్, మ్యాగజైన్స్ వంటివి కూడా 'సినిమాపేజీ' లేకుండా, సినిమా స్టార్స్ ఫోటోలు లేకుండా, సినిమావాళ్లమీద రాసే గాసిప్స్, టిడ్‌బిట్స్ లేకుండా అస్సలు బ్రతకలేవు.
ఇక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (గతంలో ట్విట్టర్), యూట్యూబ్ లాంటి ఫ్రీ సోషల్ మీడియా వచ్చాక - ప్రతివాడి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఒక న్యూస్ చానెల్ అయిపోయింది. విశ్లేషకులు, రివ్యూయర్స్, సినిమాల్ని చెండాడే సోకాల్డ్ మేధావులు కూడా ఒక్కసారిగా పెరిగిపోయారు. వీరంతా కూడా సినిమాల్లేకుండా బ్రతకలేరు. ఊపిరి పీల్చుకోలేరు.
సినిమాకున్న పవర్ అది!
ఎవరు ఎన్ని లాజిక్స్ చెప్పినా ఇది నిజం. ఇదే నిజం.
ఒకప్పుడు కోటి, రెండు కోట్లు అంటే ఫీల్డులో పెద్ద అంకె! ఇప్పుడు... 100, 200, 300, 500, 700, 1000 కోట్లు కూడా చాలా రొటీన్‌గా వినే ఫిగర్స్ అయ్యాయి.
సినిమా ప్యూర్‌లీ ఒక బిగ్ బిజినెస్... ఇప్పుడు!
కట్ చేస్తే -
'సక్సెస్ ఈజ్ సెక్సీ' అనేది ఇక్కడ అక్షరాలా నిజం.
నువ్వు ఆర్టిస్టు కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు... ఒకే ఒక్క సక్సెస్ నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. భారీ స్థాయిలో డబ్బూ, ఊహించని రేంజ్ వ్యక్తులతో సంబంధాలూ, ఓవర్‌నైట్‌లో ఫేమ్... ఇవన్నీ ఇక్కడే సాధ్యం.
చిన్నదో పెద్దదో... ఒకే ఒక్క సక్సెస్‌తో బెల్లం చుట్టూ ఈగల్లా నీ చుట్టూ ఎందరో చేరతారు... నువ్వే ఆశ్చర్యపోయేంతగా! ఆ తర్వాత నువ్వెన్ని గుడ్డి నిర్ణయాలు తీసుకొన్నా, కనీసం ఒక దశాబ్దం నీకెలాంటి కష్టం ఉండదు. ఏ లోటూ ఉండదు. నువ్వు కలలో కూడా ఊహించని వ్యక్తులు ఓవర్‌నైట్‌లో నీ నెట్‌వర్క్‌లోకొస్తారు. అప్పటిదాకా నిన్ను కేర్ చేయని, నిన్ను వెలివేసిన నీ సోకాల్డ్ మిత్రులూ బంధువులూ "ఆహా ఓహో" అంటూ నిన్ను వెతుక్కుంటూ నీదగ్గరకొస్తారు. వీళ్లందరి నటన ముందు... నువ్వు అప్పటిదాకా డైరెక్ట్ చేసిన నీ నటీనటులు కూడా ఎందుకూ పనికిరారు.
అంతా ఒక మాండ్రెక్స్ మత్తులా ఉంటుంది... 24/7 x365 డేస్. ఇలాంటి సక్సెస్ ఇచ్చిన కిక్కుతో వెంటనే మరో సక్సెస్‌ని కూడా ముద్దాడావనుకో... ఇక అంతే. భూమ్మీదనే నువ్వు స్వర్గం అనుభవిస్తావు. స్వర్గం అంటే... 'చచ్చాక వెళతారు' అనే ఏదో సోకాల్డ్ నాన్సెన్సికల్ ఇల్యూజనరీ డెస్టినేషన్ కాదు. అక్కడి రంభ, ఊర్వశి, మేనకలు అసలే కాదు.
అదొక అనిర్వచనీయమైన అనుభూతి. ఫాలోడ్ బై... రకరకాల అనుభవాల పరంపర. నీ ఫాంటసీలన్నీ నిజమవుతాయి.
అనుక్షణం ఆనందో బ్రహ్మ!
ఇంకేం కావాలి?
నువ్వు బాగుంటావు. నీ కుటుంబం, నీ బంధుమిత్రులు, నీ శ్రేయోభిలాషులు అంతా బాగుంటారు. ఫీల్డులో, లైమ్‌లైట్‌లో ఉన్నంతసేపూ నువ్వు ఏ పనులంటే ఆ పనులు అలా అలా పూర్తయిపోతుంటాయి. నువ్వు చేసుకొనే ఇతర వ్యాపారాలకు సినిమా అనే నీ నేపథ్యం ఒక పెద్ద సపోర్ట్
అవుతుంది. పొలిటీషియన్స్, క్రికెట్ స్టార్స్, బిజినెస్ మాగ్నెట్స్, బాబాలు, గురూజీలను కలవడం అనేది నీకు వెరీ సింపుల్ అయిపోతుంది. ఇంకెవరిని కలవాలన్నా అపాయింట్‌మెంట్ అనేది నీకసలు సమస్యేకాదు. లిటరల్లీ, ఎక్కడికెళ్లినా నీకు రెడ్ కార్పెటే.
మనీ, మందు, ఆపోజిట్ సెక్స్‌తో ఫ్రెండ్‌షిప్స్ అనేవి... సక్సెస్ ఉన్నచోట, ఏ ఫీల్డులో అయినా మామూలే. అయితే... ఇక్కడ కొంచెం గ్లామర్ కూడా యాడ్ అవుద్ది కాబట్టి... అసలా కిక్కే వేరుగా ఉంటుంది. ఎక్కడో స్టీల్‌ప్లాంట్ గెస్ట్ హౌజ్‌లో... నువ్వు కాఫీ త్రాగుతూ రిలాక్స్ అవుతున్నప్పుడు, నీచేతిలో ఉన్న జెఫ్రీ ఆర్చర్ నవల... అక్కడే ఇంకో సినిమా షూటింగ్‌లో ఉన్న ఒక టాప్ హీరోయిన్‌తో నువ్వూహించని ఫ్రెండ్‌షిప్‌కు దారితీయవచ్చు. అంతకుముందు నువ్వు చూస్తే చాలు అనుకున్న ఒక సూపర్ స్టార్‌ను, గండిపేటలో ఆయన షూటింగ్ లొకేషన్‌లో కలిసి కబుర్లు చెప్పొచ్చు. కలవటమే అదృష్టం అని అప్పటివరకూ నువ్వనుకొన్న ఒక సీనియర్ డైరెక్టర్ ఇంట్లో, ఆయనతో కలిసి భోజనం చేస్తూ గంటలు గంటలు గడపొచ్చు.
స్టార్ హోటళ్ళు, ఫ్లయిట్ జర్నీలు, కార్లు, లాంగ్ డ్రైవ్‌లు అనేవి... చూస్తుండగా నీకు మామూలయిపోతాయి. నువ్వెన్నడూ కలలో కూడా ఊహించని ఒక ట్రెండీ బిజినెస్‌ను... సింగిల్‌గా... 24 గంటల్లో నువ్వే ప్రారంభిస్తావు. నీలో కాన్‌ఫిడెన్సుకి, నీ క్రియేటివిటీకి ఆకాశమే హద్దవుతుంది. నీకే ఆశ్చర్యం వేసేలా, నువ్వేదనుకొంటే అది, ఎప్పుడనుకొంటే అప్పుడు... అన్నీ డెడ్-ఈజీగా చెయ్యగలుగుతుంటావు. నువ్వూహించని ఎన్నో చిన్న చిన్న అందమైన అనుభవాలను నీ జీవితంలో ప్రతిరోజూ, ప్రతిపూటా ఆహ్వానిస్తూనే ఉంటావు... నాన్‌స్టాప్‌గా. స్వర్గం ఎక్కడో లేదు, నీ కళ్లముందే ఉన్నట్టుగా నువ్వు అనుక్షణం ఫీలవుతుంటావు.
సో... ఆ స్వర్గద్వారాల్ని స్పృశించడానికైనా నువ్వు సినీఫీల్డులోకి వెళ్లితీరాలి.
ఇక్కడ ఫినిషింగ్ టచ్ ఏంటంటే -
ఈ స్టేజికి చేరుకొనే అవకాశం అందరికీ రాదు... అందరికీ సాధ్యంకాదు. ఫీల్డులోకి ఎంటరయ్యి, అవకాశం అందిపుచ్చుకొన్న ప్రతి 100 మందిలో కేవలం ఒకరిద్దరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ ఇద్దరిలో నేను కూడా ఉంటాను అన్న నమ్మకం నీకున్నట్లైతే... ఆ ఒక్కన్ని నేనే అవుతాను అన్న ఆత్మవిశ్వాసం నీకున్నట్టయితే... ఇంక ఒక్క క్షణం ఆగొద్దు.
నువ్వు ఫీల్డులోకి వెళ్లితీరాలి... దూకేసెయ్యాలి.
అయితే... ఒక 2 తప్పులు మాత్రం చెయ్యొద్దు. దురదృష్టవశాత్తూ... ఫీల్డులోకి ఎంటరయ్యే 90 శాతం మంది ఆ రెండుతప్పులే చేస్తారు. ఫలితంగా, స్వర్గం ఎప్పుడూ వారికి ఇంచ్ దూరంలో ఉన్నట్టే ఉంటుంది. ఎన్నేళ్లయినా ఆ ఇంచు అంచును కూడా వారు తాకలేరు!
ఆ రెండు తప్పులేంటన్నది నా తర్వాతి పోస్టులో!
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani