"స్విమ్మింగ్‌పూల్" చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా నేను పరిచయం చేసిన ప్రదీప్‌చంద్ర మద్దిరాలకు మ్యూజిక్ ఒక ప్యాషన్, ప్రాణం కూడా.
ఎమ్మే క్లాసికల్ మ్యూజిక్, ఎమ్మే వెస్టర్న్ మ్యూజిక్ పూర్తిచేశాడు ప్రదీప్. తర్వాత... చదవడం చేతకాదు అనుకునేవాళ్లను సంతృప్తిపర్చడం కోసం కంప్యూటర్ సైన్స్‌లో ఎమ్‌టెక్ చేశాడు. ఎమ్మెస్సీ సైకాలజీ కూడా చేశాడు.
నేను హెచ్ఎమ్‌టి, జవహర్ నవోదయ విద్యాలయ, ఆలిండియా రేడియో వంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసి వదిలేసినట్టు, ప్రదీప్ కూడా డెల్ లాంటి కంపెనీల్లో పనిచేశాడు, వదిలేశాడు.
ఆ తర్వాతే, ఆ "మంద మెంటాలిటీ" దుకాణం మూసేసి, మళ్ళీ తనకెంతో ప్రియమైన మ్యూజిక్‌ని చేరుకున్నాడు. అక్కున చేర్చుకున్నాడు.
స్విమ్మింగ్‌పూల్ ఒక రొమాంటిక్ హారర్ సినిమా. ఈ చిత్రం కోసం ప్రదీప్ చేసిన పాటల్లో ఒక్క మెలొడీ చాలు. తన టాలెంట్ ఏంటో గుర్తించడానికి. చివరి రీల్, చివరి సీన్‌లో అతనిచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలు. అసలు అతనేంటో తెలుసుకోడానికి!
అయితే, ఆ సినిమా పరిమితులు దానికున్నాయి. ఒక మామూలు సినిమా స్టోరీ సిట్టింగ్స్‌కు అయ్యే ఖర్చుతో ఆ సినిమా పూర్తిచేసి, రిలీజ్ చేశాం. క్వాలిటిదగ్గర ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.
అయితే, ఆ సినిమా పరిమితులు దానికున్నాయి. ఒక మామూలు సినిమా స్టోరీ సిట్టింగ్స్‌కు అయ్యే ఖర్చుతో ఆ సినిమా పూర్తిచేసి, రిలీజ్ చేశాం. క్వాలిటిదగ్గర ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.
చాలామంది బయటివాళ్లు, లోపలివాళ్లు కూడా ఆ సినిమా జరుగుతున్న సమయంలో ప్రదీప్ విషయంలో చాలా కామెంట్స్ చేశారు. అలా కామెంట్ చేసినవాళ్లంతా ఇప్పుడు తెరమరుగయ్యారు.
ప్రదీప్ ఇంకా సీన్లో ఉన్నాడు... భారీ టార్గెట్స్‌తో.
ప్రదీప్ ఇంకా సీన్లో ఉన్నాడు... భారీ టార్గెట్స్‌తో.
ప్రదీప్‌లో ఉన్న ప్యాషన్‌ను చూసి - మ్యూజిక్ డైరెక్టర్‌గా అతని తొలి ఆడియో వేడుకను బంజారా హిల్స్ లోని రావి నారాయణ రెడ్డి హాల్‌లో "లైవ్" చేశాను. ఒక రేంజ్‌లో ప్లాటినమ్ జుబ్లీ ఫంక్షన్ కూడా చేశాను.
ప్రదీప్ టాలెంట్ విషయానికొస్తే - స్విమ్మింగ్‌పూల్ జస్ట్ ఒక చిన్న ప్రారంభం మాత్రమే. ప్రాక్టికల్ పాయింటాఫ్ వ్యూలో తను చేయాల్సింది, చేసి తీరాల్సిందీ చాలా ఉంది.
నాకు తెలుసు. ప్రదీప్ అనుకున్నది సాధిస్తాడు. ఆ రోజు కూడా వస్తుంది.
కట్ చేస్తే -
మొన్న నేను చేసిన రోడ్-క్రైమ్-థ్రిల్లర్ "ఎర్ర గులాబి" సినిమాలో బడ్జెట్, కొన్ని ఇతర సాంకేతిక, వ్యక్తిగత కారణాల వల్ల... "నేను మీరు ఆశించే మ్యూజిక్ ఇవ్వలేను, సర్" అని చాలా మర్యాదగా చెప్పి, ఈ సినిమా బాధ్యత నుంచి తప్పుకున్నాడు ప్రదీప్.
కాని, తప్పించుకోలేడు. ఆ వివరాలు త్వరలో తెలుస్తాయి.
మ్యూజిక్ విషయం పక్కనపెడితే - నా సినిమాలన్నింటికి, నా తరపున "డైరెక్టర్స్ సీ.ఈ.వో." గా ప్రదీప్ తెరవెనుక చాలా పనిచేస్తుంటాడు.
మేమిద్దరం కలిసి చేసే ఫీచర్ ఫిలిం ప్రాజెక్టులు కనీసం ఇప్పుడొక రెండు ఉన్నాయి. ఆ పనుల్లో ప్రదీప్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు.
ఇద్దరం కలిసి ఇప్పుడు చాలా చెయ్యబోతున్నాం. చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఉన్నాయి. చిన్న కిక్ స్టార్ట్ ఒక్కటే జరగాల్సి ఉంది. అదీ జరుగుతుంది.
ఇద్దరం కలిసి ఇప్పుడు చాలా చెయ్యబోతున్నాం. చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఉన్నాయి. చిన్న కిక్ స్టార్ట్ ఒక్కటే జరగాల్సి ఉంది. అదీ జరుగుతుంది.
నా అంచనా ప్రకారం, ఒక వారం రోజుల ముంబై ట్రిప్‌తో మా ఇద్దరి క్రియేటివ్ జర్నీ మళ్ళీ ఊపందుకుంటుంది.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani