ఆర్టిస్టుగా కానీ, టెక్నీషియన్‌గా కానీ, ఆఫీస్‌బాయ్‌గా అయినా కానీ... సినీ ఫీల్డులోకి ఎంటర్ కావాలనుకొనేవారు ముందుగా తెల్సుకోవాల్సిన చిన్న లెక్క ఒకటుంది. అదేంటంటే -
ఫీల్డులోకి ప్రవేశించాలనుకొని ఫిలిమ్‌నగర్‌కు వచ్చే ప్రతి 1000 మందిలో కేవలం ఒక 10 మందికి మాత్రమే అవకాశం దొరుకుతుంది.
అదీ ఎంతో కష్టంగా!
ఆ పదిమందిలో కూడా - ఏ ఒక్కరికో ఇద్దరికో మాత్రమే క్లిక్ అయ్యే అవకాశం లభిస్తుంది. వాళ్లే ఫీల్డులో కొద్దిరోజులు నిలబడగలుగుతారు. ఎందుకలా అంటే .. దాని లాజిక్కులు దానికున్నాయి. అదంతా తర్వాత.
మళ్లీ పాయింటుకొస్తే -
సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీస్తారు? వాటిలో కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చే సినిమాలు ఎన్నుంటాయి? ఆ సినిమాల్లో ఎంతమందికని అవకాశం ఇవ్వడం వీలవుతుంది?
అసలు ఒక సినిమాలో ఎంతమంది కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడానికి వీలవుతుంది? ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ చేసినా ఎలా వీలవుతుంది?
పూర్తిగా కొత్తవాళ్లతో తీసే సినిమాకు కూడా ఒక పరిమితి ఉంటుంది కదా? ప్రతిరోజూ సినిమా ఆఫీసులకొచ్చే వందలమందిలో ఎంతమంది కొత్తవారికి అవకాశం ఇచ్చే వీలుంటుంది?
ఈ లెక్కంతా టాలెంట్‌తో సంబంధం లేకుండా చెప్తున్నది. టాలెంట్ విషయానికి తర్వాత వద్దాం. ఆ సబ్జక్టు వేరే... డీటెయిల్‌గా డిస్కస్ చెయ్యాల్సిన సబ్జక్టు అది.
ఒక్క టాలీవుడ్‌లోనే కాదు. ఏ వుడ్డులోనయినా ఇదే లెక్క!
ఎవరిలో ఎంత టాలెంట్ ఉందని అనుకున్నా, నిజంగా ఉన్నా, వాస్తవం మాత్రం ఇదే. ఈ వాస్తవాన్ని ఎదుర్కొనే దమ్మున్నవాళ్లకే సినీఫీల్డు స్వాగతం పలుకుతుంది.
మరి మీలో ఆ దమ్ముందా?!
ఆ దమ్ముందంటేనే ఎక్కడో ఒకచోట చాన్స్ తగుల్తుంది. తర్వాత ఏమవుద్ది అనేది వేరే విషయం... మళ్లీ మాట్లాడుకుందాం.
కట్ టూ సోక్రటీస్ -
ఈ మహా తత్వవేత్త చెప్పిన ఒక మాట ఈ సందర్భంగా కోట్ చెయ్యాలనిపిస్తోంది:
"నిన్ను నువ్వు తెల్సుకో!"
-మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani