"మా వాడు చదువుకోవట్లేదు. ఉద్యోగం చేయడు. బిజినెస్ చేయలేడు. ఏ పనీ చేతకాదు. ఎందుకూ పనికిరాడు. కొంచెం నీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పెట్టుకో!"
ఒకరోజు పొద్దున్నే గురువుగారు "దర్శకరత్న" దాసరి గారికి కాల్ చేసి అలా అడిగాట్ట ఆయన స్నేహితుడు. బయటివాళ్ల దృష్టిలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంటే మరీ అంత పనికిరానిదన్నమాట!
ఈ జోక్‌ని స్వయంగా గురువుగారు, దర్శకరత్న దాసరి నారాయణరావుగారు అప్పటి తన బంజారాహిల్స్ ఆఫీసులో స్వయంగా నాతో చెప్పారు. ఒక్క డైరెక్షన్ డిపార్ట్‌మెంటే కాదు. టోటల్‌గా సినీఫీల్డులో పనిచేసేవారంతా ఎందుకూ పనికిరానివాళ్లని ఇతర ఫీల్డులవాళ్ల అభిప్రాయం.
"చదువుకోవడం చేతకానివాళ్లంతా సినీఫీల్డంటారు!" అని కూడా అంటారు కొంతమంది. వాళ్లకి తెలీదు... ఫీల్డులో హైస్కూల్ డ్రాపవుట్స్ నుంచి, ఎమ్ బి ఏ లు, యూనివర్సిటీ డబుల్ గోల్డ్ మెడలిస్టులు, న్యూక్లియర్ ఫిజిక్స్ పీజీలు, ఐ ఐ ఎమ్ నేపథ్యాన్ని అలవోగ్గా అలా వదిలేసినవాళ్ల దాకా ఎందరో ఉన్నారని!
"అబ్బో సినిమావాళ్లా!" అంటారు కొందరు. మిగిలినవాళ్లంతా ఏదో సొక్కమైనట్టు. వీళ్లేదో చేయరాని పని చేస్తున్నట్టు! దేన్నయినా సరే జనరలైజ్ చేసి మాట్లాడే ఇలాంటివాళ్లంతా తెలుసుకోవాల్సిన ఒక నిజం ఎన్నటికీ తెల్సుకోలేరు.
"మ్యాటర్ ఎప్పుడూ ఫీల్డు కాదు. మన మైండ్‌సెట్" అనేది కామన్‌సెన్స్. అన్ని ఫీల్డుల్లో మంచీ చెడు ఉంటుంది. ఇది గ్లామర్ ఫీల్డు కాబట్టి, ఇక్కడ దగ్గినా తుమ్మినా బ్రేకింగ్ న్యూసే.
సినిమా న్యూస్‌లు, సినిమావాళ్ళమీద టిడ్‌బిట్స్, సినిమా బేస్‌డ్ ప్రోగ్రామ్స్, సినిమావాళ్ల ఫోటోలు, బైట్స్ లేకుండా ఏ పత్రికా, ఏ చానెల్, ఏ సోషల్ మీడియా బ్రతకలేదు. సగటు మనిషి జీవితంలో కూడా సినిమా ఒక అంతర్భాగం. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సినిమావాళ్ళ కొలాబొరేషన్ లేకుండా దాదాపు ప్రపంచంలోని ఏ బిజినెస్, ఏ ప్రొఫెషన్ కూడా ఉండే అవకాశం లేదు.
ఇప్పుడు సీన్ మారింది. సినిమా ఒక పాష్ & ప్రీమియమ్ స్థాయి ప్రొఫెషన్ అని, అందులో ఎంట్రీ అనేదే చాలా గొప్ప విషయమని రియలైజ్ అవుతున్నారు. అవక తప్పదు. మనీకి మనీ, ఫేమ్‌కి ఫేమ్... సినిమానా మజాకా!
ఒకప్పడు లక్షల్లో ఉండే అంకెలు... ఇప్పుడు పదుల కోట్లు, వందల కోట్ల దాకా ఎలా వెళ్తున్నది కూడా షాకవుతూ మరింత బాగా గమనిస్తున్నారు.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani