హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్... ఏ సినిమా ఫీల్డులో అయినా చూడండి... ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ అంతకుముందు... పూర్వాశ్రమంలో మేనేజర్స్‌గా పనిచేసినవాళ్లే!
ఇది నేను నెగెటివ్‌గా చెప్పట్లేదు. సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలో చెప్తున్నాను.
వాళ్ళేం భారీగా ఎంబిఏలు గింబీయేలు చదువుకొని వుండరు. అంతకుముందు కోటీశ్వరులు కూడా కాదు లక్షలు, కోట్లు ఇన్వెస్ట్ చెయ్యడానికి. కాని, వాళ్ళు ప్రొడ్యూసర్స్ అవుతారు, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్ అవుతారు.
ఎలా సాధ్యం?
జస్ట్ వన్ థింగ్. ఫోకస్. ఒక్కటే ఒక్క లక్ష్యం... ఏమైనా సరే, ప్రొడ్యూసర్ కావాలనుకుంటారు... అవుతారు.
బై హుక్ ఆర్ నుక్... హిట్ కొట్టాలనుకుంటారు, కొడతారు. దట్సిట్.
బై హుక్ ఆర్ నుక్... హిట్ కొట్టాలనుకుంటారు, కొడతారు. దట్సిట్.
కట్ చేస్తే -
మనం ఉన్నాం... బాగా చదువుకున్నవాళ్ళం. కొంచెమైనా ఎడ్జ్ అనేది మనకు ఉండాలి కదా?
ఉండదు.
ఎందుకు?
ప్రతిదానికీ పనికిమాలిన ఎన్నో ఎనాలిసిస్‌లు చేస్తాం. అవసరం లేకపోయినా ఎంతో ఆలోచిస్తాం. పది పడవల మీద కాళ్ళుపెడతాం. రిజల్టు ఎప్పట్లాగే ఉంటుంది... పది మందిలో పాము చావదు అన్నట్టు!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani