అంతకుముందు ఎక్కడా ఓడిపోనివాడు ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అవుతాడు. అంతకుముందు జీవితంలో ఎవ్వరిముందూ తలదించుకోనివాడు ఇక్కడ ఎంటరయ్యాక, అదే తలను పాతాళంలోకి పెట్టుకోవల్సిన పరిస్థితుల్ని ఎదుర్కొంటాడు.
అంతకుముందు - తనముందు చేతులు కట్టుకొని నిలబడటానికి కూడా అర్హతలేని అనామక వ్యక్తుల సమక్షంలో ఇక్కడ గంటలు గంటలు గడపాల్సి వస్తుంది. పనికిరాని సొల్లు వినాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది... ఇష్టం లేకపోయినా!
అప్పటివరకూ నిన్ను మెచ్చుకొంటూ ఆకాశానికెత్తిన నీ అతి దగ్గరి మిత్రులు, ఆత్మీయులు - అదే నోటితో నువ్వు కలలో కూడా ఊహించని మాటలంటోంటే విధిలేక వినాల్సివస్తుంది... ఇక్కడ ఇరుక్కుపోయిన తర్వాత!
నీ చదువు, నీ సంస్కారం, నీ సిన్సియారిటీ, నీ సెన్సిటివ్‌నెస్, నీలోని మానవత్వం, నీ మంచితనం, నీ నీతి, నీ నిజాయితీలకు ఇక్కడ అస్సలు విలువుండదు. అలా ఉంటుందనుకుంటే... అది నీ మూర్ఖత్వం.
అయితే, అప్పుడప్పుడు, సక్సెస్ సాధించి ఒక రేంజ్‌లో ఉన్నవాళ్లలో కూడా కొందరు దాదాపు ఇలాంటి పరిస్థితుల్నే ఇక్కడ ఎదుర్కోవాల్సిరావడం అత్యంత విషాదం. జీర్ణించుకోలేని ఒక వాస్తవం.
ఇదే వాస్తవం మణిరత్నం చెప్పారు, శేఖర్ కపూర్ చెప్పారు.
డిమాండ్ అండ్ సప్లై తప్ప ఇంకేం లేదిక్కడ.
ప్రపంచంలో ఎక్కడైనా, ఏ వృత్తివ్యాపారాల్లో అయినా ఇదే మూల సూత్రం కదా పనిచేసేది? ఖచ్చితంగా అవును.
కాని, ఇది గ్లామర్ ఫీల్డు కాబట్టి ఇక్కడ ప్రతి చిన్నదీ ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతుంది. సొషల్‌గా, వ్యక్తిగతంగా ప్రభావం కూడా ఎక్కువే చూపిస్తుంది. చెప్పాలంటే - ఇక్కడ ప్రతి చిన్న అంశం ఒక బ్రేకింగ్ న్యూస్ అవుద్ది...
ఎక్కువగా నెగెటివ్‌గా!

దటీజ్... ది గ్రేట్ సినీఫీల్డు.
కట్‌చేస్తే -
అంత నిరాశపడకండి...
ఇదంతా నాలోని నెగెటివిటీ కాదు. ఫీల్డులోని రియాలిటీ.
బట్, ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే!
నాణేనికి మరోవైపు కూడా ఉంది.
అది గోల్డ్. ఉట్టుట్టి గోల్డ్ కాదు, మెకన్నాస్ గోల్డ్. అదేంటో నా తర్వాతి పోస్టు, "సినీఫీల్డులోకి ఎందుకు వెళ్ళితీరాలి?"లో చూడండి. రేపు.
అది గోల్డ్. ఉట్టుట్టి గోల్డ్ కాదు, మెకన్నాస్ గోల్డ్. అదేంటో నా తర్వాతి పోస్టు, "సినీఫీల్డులోకి ఎందుకు వెళ్ళితీరాలి?"లో చూడండి. రేపు.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani