డబ్బు ముఖ్యం కాదు అని కొందరు ఏదేదో చెప్తుంటారు. అలాంటివాళ్ళు... అయితే ఇప్పటికే బాగా డబ్బు సంపాదించినవాళ్ళయినా అయ్యుండాలి. లేదంటే అసలు డబ్బు సంపాదించటం చేతకానివాళ్లయినా అయ్యుండాలి.
కట్ చేస్తే -
డబ్బు నీ చేతిలో ఉంటే, నీ టైమ్ నీ చేతిలో ఉన్నట్టే. నువ్వు చెయ్యాలనుకున్న పనే చేస్తావు. నీకిష్టం లేని పని చెయ్యవు.
డబ్బు నీ చేతిలో ఉంటే, నీకు నచ్చని వాతావరణం నుంచి, నీకు నచ్చని వ్యక్తుల నుంచి క్షణంలో దూరంగా వెళ్ళిపోగలుగుతావు.
డబ్బుంటేనే కదా ఎమర్జెన్సీలో నువ్వు హాస్పిటల్ బిల్స్ కట్టగలిగేది? ఇష్టమైనవి కొనుక్కోగలిగేది, ఇష్టమైనవాళ్లతో గడపగలిగేది, ఇష్టమైనట్టుగా బ్రతకగలిగేది కూడా డబ్బుంటేనే కదా?
డబ్బుంటేనే కదా అసలు నిన్ను ఎవడైనా పట్టించుకునేది?
డబ్బుంటేనే కదా అసలు నిన్ను ఎవడైనా పట్టించుకునేది?
ఇంత ఫ్రీడం నీకిచ్చేది డబ్బే. అందుకే డబ్బు ముఖ్యం కాదు అని కథలు, కవిత్వం రాసేవాళ్ళకు, అలాంటి మాటలు చెప్పేవాళ్ళకు ముందు నువ్వు దూరంగా ఉండు.
నీకు చేతనైన పనులన్నీ చెయ్యి. బాగా సంపాదించుకో. నీకు అవసరమైన ఫ్రీడంతో ఆనందంగా ఉండు.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani