నా మొదటి సినిమాలో ఒక కొత్త నటున్ని ఫుల్ లెంగ్త్ పవర్‌ఫుల్ మెయిన్ విలన్ రోల్‌లో పరిచయం చేశాను. అతను నిజంగా చాలా మంచి నటుడు. చాలా బాగా చేశాడు. నేననుకున్న కథ ప్రకారం సినిమా చివర్లో కూడా హీరోకంటే ఎక్కువ వెయిటేజ్ ఆ విలన్ కేరెక్టర్‌కే ఇచ్చాను.
ఇలా చేయడం వల్ల నేను ఆ విలన్ దగ్గర బాగా డబ్బులు తీసుకున్నానని అప్పట్లో ఆ చిత్రంలోని హీరో అనుకోవడం, అతన్లోని ఆ ఫీలింగ్‌ను పైకే అనడం కూడా జరిగింది.
అప్పట్లో ఆ హీరో నేనూ మంచి ఫ్రెండ్స్. మధ్యలో కొందరుంటారుగా... చెడగొట్టారు. అది వేరే విషయం. దాని గురించి తర్వాత రేపటి బ్లాగ్‌లో చెప్తాను.
కట్ చేస్తే -
ఇప్పుడా విలన్ ఓ మాదిరి మంచి పొజిషన్‌లోనే ఉన్నాడు. ఇండస్ట్రీలోని కొన్ని సహజ లక్షణాల నేపథ్యంలో మేం అసలిప్పుడు టచ్‌లో లేము. టచ్‌లో ఉన్నా లేకపోయినా, నేను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నటుడు కాబట్టి నాకు నిజంగానే సంతోషంగా ఉంటుంది. ఆ నటునిపట్ల, అతని నటనపట్ల నా అలోచన మారదు, వ్యక్తిగా అతని పట్ల నా గౌరవం మారదు.
ఇండస్ట్రీలో ఇన్నేళ్ళుగా ఉన్నాడు. బాగున్నాడు. అదే నా సంతోషం. ఇంతకు మించి నేను ఆలోచించను. వేరే ఆశించను.
అయితే... ఆమధ్య ఒక మిత్రుడు చెప్పాడు. ఆ నటుని ఇంటర్వ్యూ ఒక దినపత్రిక ఆదివారం ఎడిషన్లో వచ్చింది. ఎవరెవరి గురించో చెప్పాడు కానీ... తొలి అవకాశం ఇచ్చి, ఇండస్ట్రీకి పరిచయం చేసి, అంత పూర్తిస్థాయి మెయిన్ విలన్ రోల్ ఇచ్చిన నీ పేరు చెప్పలేదు ఆ నటుడు అని!
నేను నవ్వాను.
ఇదంతా ఉట్టి ట్రాష్.
ఇలాంటివి అసలు పట్టించుకోకూడదు.
ఇక్కడ ఎవరు లైమ్‌లైట్‌లో ఉంటే వాళ్లే తోపులు.
అసలు సినిమా అంటేనే ఇది.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani