"When people ask me how to become a director, I ask: "How much humiliation can you take?" - Shekhar Kapur
మిస్టర్ ఇండియా, బాండిట్ క్వీన్, ఎలిజబెత్ వంటి సినిమాలను తీసిన హాలీవుడ్ స్థాయి దర్శకుడే లేటెస్టునా నిన్న ఉదయం ఎక్స్‌లో పోస్ట్ చేసిన మాట ఇది.
దీన్ని కోట్ చేస్తూ, నేను వెంటనే ఒక పోస్టు పెట్టాను.
'మణిరత్నం కూడా దాదాపు ఇదే చెప్పారు: "నువ్వు సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయినప్పుడే బాధ, అవమానం అనే మాటలు విడిచి పెట్టాలి. ఎందుకంటే, ఇక్కడ నీకు అవి అడుగడుగున ఎదురవుతాయి" అని.
శేఖర్ కపూర్ వెంటనే ఎక్స్‌లో నా పోస్టుకు లైక్ కొట్టారు.
దీన్ని కోట్ చేస్తూ, నేను వెంటనే ఒక పోస్టు పెట్టాను.
'మణిరత్నం కూడా దాదాపు ఇదే చెప్పారు: "నువ్వు సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయినప్పుడే బాధ, అవమానం అనే మాటలు విడిచి పెట్టాలి. ఎందుకంటే, ఇక్కడ నీకు అవి అడుగడుగున ఎదురవుతాయి" అని.
శేఖర్ కపూర్ వెంటనే ఎక్స్‌లో నా పోస్టుకు లైక్ కొట్టారు.
ఆమధ్య మణిరత్నం బర్త్‌డే నాడు ఒక ఆర్టికిల్ చూస్తున్నపుడు అతను చెప్పిన ఈ మాట నాకు కనిపించింది. ఇంటా బయటా ఎన్నో అనుభవించకపోతే, మణిరత్నం ఇంత గొప్ప వాస్తవం చెప్పేవాడు కాదు కదా అని నాకనిపించింది. అంతదాకా ఎందుకు... మణిరత్నం డైరెక్టర్‌గా నిలదొక్కుకుంటున్న రోజుల్లో సుహాసిని డేట్స్ అడిగితే ఇవ్వలేదు. మణిరత్నం అప్పుడు అంత పెద్ద డైరెక్టర్ కాదు. సుహాసిని మాత్రం అప్పటికే ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోయిన్! తర్వాత, 1987లో అనుకుంటాను, మణిరత్నం 'నాయకుడు' సినిమాతో డైరెక్టర్‌గా ఇండియాలోనే టాప్ రేంజ్‌కి ఎదిగిపోయాడు. 1988లో సుహసిని అతన్ని పెళ్ళిచేసుకుంది.
దటీజ్ సినిమా.
దటీజ్ సినిమా.
మామూలుగా క్రిష్ణానగర్ సినిమా కష్టాలు వేరు. అవి అందరికీ కామన్.
కాని, ఇండస్ట్రీలోకి ప్రవేశించి, ఒక స్థాయికి వచ్చినవాళ్ళు కూడా ఎన్నెన్నో బాధలు, అవమానాలు ఫేస్ చేయాల్సిన పరిస్థితులు రావడం ఈ ఫీల్డులో సర్వసాధారణం.
మణిరత్నం, శేఖర్ కపూర్ స్థాయివాళ్ళే అంత సింపుల్‌గా సినీఫీల్డులో లైఫ్ గురించి చెప్పారంటే, ఇది మరీ అంత సింపుల్‌గా తీసుకొనే విషయమేం కాదు.
ఇలాంటివాటికి భయపడో బాధపడో సెంటిమెంటల్‌గా ఫీలయ్యేవాళ్ళు ఇక్కడ పనికిరారు. ఏం సాధించలేరు.
ఇలాంటివాటికి భయపడో బాధపడో సెంటిమెంటల్‌గా ఫీలయ్యేవాళ్ళు ఇక్కడ పనికిరారు. ఏం సాధించలేరు.
పెద్ద పెద్ద హీరోలకు ఇండస్ట్రీ రికార్డు బ్లాక్‌బస్టర్ హిట్లిచ్చిన పూరి జగన్నాధ్ లాంటివారు వరుసగా రెండు మూడు ఫ్లాపులిచేటప్పటికి, ప్రతివాడూ కామెంట్ చేసేవాడే. అసలు సినిమా ఎట్లా తీస్తారన్న విషయంలో అ-ఆలు తెలియనివాడు కూడా నీతులు చెప్పడమే.
హీరోల విషయంలో కూడా అంతే... వరుసగా ఒక రెండు ఫ్లాపులొస్తే చాలు, "ఎలాంటి సబ్జెక్ట్ ఎన్నుకోవాలన్న విషయంలో ఆ హీరోకి జడ్జ్‌మెంట్ లేదు" అంటూ నానా కామెంట్స్ చేస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఒక సీనియర్ అన్నాడంటే ఒక అర్థముంటుంది. సినీఫీల్డు గురించి ఏం తెలియనివాళ్ళు కూడా చాలా సింపుల్‌గా అనేస్తారు. ఇక యూట్యూబుల్లో అయితే చర్చలే చర్చలు!
ఇంక ఇక్కడ లిస్టు చెయ్యని అవమానాలు వెయ్యుంటాయి...
కట్ చేస్తే -
ఒక డైరెక్టరయినా సరే, ఒక హీరో అయినా సరే... తమ సినిమాల విషయంలో ఎన్నో కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కొన్ని వర్కవుట్ అవుతాయి, కొన్ని కావు. కొంచెం అటూయిటూ అయ్యిందా, వీళ్ళంతా లోపలివాళ్ళు-బయటివాళ్లనుంచి ఎన్నో అవమానకరమైన కామెంట్స్, ట్రీట్‌మెంట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటన్నిటినీ పట్టించుకుంటే బ్రతకలేరు.
అయితే... ఇవన్నీ ఫేస్ చేసే దమ్మున్నవాళ్లకే ఇక్కడ ఏ కొంచెమైనా సాధించే అవకాశం ఉంటుంది. లేదంటే, ఇంకేదైనా పని చూసుకుంటే మంచిది.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani