ఐఫోన్‌తోనే మొత్తం సినిమా షూట్ చేసి, అదే ఐఫోన్‌లో ఎడిటింగ్‌తో సహా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి, ఆ సినిమాలను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో పోటీకి పంపిస్తున్న రోజులివి.
ఒకవైపు వందల కోట్లల్లో బడ్జెట్లు ఎలా పెరిగిపోతున్నాయో, మరోవైపు దాదాపు అసలు బడ్జెట్టే అవసరంలేని విధంగా "నో బడ్జెట్", "రెనగేడ్ సినిమాలు" కూడా రూపొందుతున్న రోజులివి.
యాక్టర్‌గా కావచ్చు, స్క్రిప్ట్ రైటర్‌గా కావచ్చు, డైరెక్టర్‌గా కావచ్చు... ఇప్పుడెవరైనా సులభంగా సినీఫీల్డులోకి ప్రవేశించవచ్చు.
ఇంతకుముందు సినిమా ఫీల్డు వేరు. డిజిటల్ టెక్నాలజీ వచ్చాక సినిమా ఫీల్డు వేరు. ఇంకా చెప్పాలంటే, కరోనాకు ముందు సినీఫీల్డ్ వేరు, కరోనా తర్వాత సినీఫీల్డు వేరు.
కమ్యూనికేషన్ విషయంలో కొంచెం కమాండ్ వుంటే చాలు, సోషల్ మీడియా ద్వారానే ఎందరో సెలబ్రిటీలతో డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోవచ్చు ఇప్పుడు. ఒక చిన్న షార్ట్ ఫిలింను చాలా ఎఫెక్టివ్‌గా తీసి మెప్పించడం ద్వారా సినీఫీల్డు దృష్టిలో పడొచ్చు.
ఎవ్వరిదగ్గరా అసిస్టెంట్‌గా పనిచేయకుండానే, డైరెక్ట్ డైరెక్టర్‌గా ఇలా ఆఫర్లు పొందినవాళ్ళు కూడా ఇప్పుడున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ బజ్‌లో ఉండి, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా సినీఫీల్డు దృష్టిలో పడి, యాక్టర్స్ అవుతున్నవాళ్ళు కూడా ఇప్పుడెందరో ఉన్నారు.
ఒక నాలుగైదేళ్ళ క్రితం ఇండస్ట్రీతో పోలిస్తే, ఇప్పుడు సినిమాల్లో చాన్స్ సంపాదించుకోవడం చాలా ఈజీ.
డైరెక్టర్ కావడానికి కూడా గతంలో లాగా ఒక పదేళ్ళపాటు 10 సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. నిజంగా మీలో ఆ క్రియేటివిటీ వుంటే డైరెక్ట్‌గా డైరెక్టర్ అయిపోవచ్చు.
రైటర్ విషయంలో కూడా అంతే. ఒక సెన్సేషనల్ స్క్రిప్టు రాసే సత్తా మీలో నిజంగా వుంటే ఇంకెవ్వరిదగ్గరా ఓ పదేళ్ళపాటు అసిస్టెంట్‌గా పనిచెయ్యాల్సిన అవసరంలేదు.
కట్ చేస్తే -
ఔత్సాహికులైన కొత్తవాళ్ళు తెలుసుకోవల్సిన బేసిక్స్ అంటూ కొన్నుంటాయి...
ఫిలిం ఇండస్ట్రీ అసలు ఎలా పనిచేస్తుంది? ఎలా చాన్సులు దొరుకుతాయు? అసలు కొత్తవాళ్లలో ఇండస్ట్రీకి ఏం కావాలి? కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వారిలో ఉన్న స్కిల్స్‌ను ఎలా ఇండస్ట్రీ కోరుకొనే విధంగా మౌల్డ్ చేసుకోవాలి... వంటి కొన్ని అతి ముఖ్యమైన విషయాల్లో అవగాహన అవసరం.
ఈ ప్రాథమిక అవగాహన లేకుండా చేసే యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రయత్నాలు ఏవీ ఫలించవు. మీ అత్యంత విలువైన సమయం, డబ్బూ వృధా అయిపోతాయి.
దీనికోసమే సీనియర్స్ సలహాలు అవసరం. పనికొచ్చే వన్-టు-వన్ పర్సనల్ కోచింగ్ అవసరం. లేదా, ఒక సినిమా టీమ్‌లో పూర్తిస్థాయిలో పనిచేయడం అవసరం.
ఇప్పుడు నాదగ్గర పనిచేస్తున్న టీమ్‌లో కనీసం ఇద్దరు ఏడీలు త్వరలో డైరెక్టర్స్ కాబోతున్నారు.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani