ఒక మల్టిఫేరియస్ క్రియేటివ్ ఫ్రీలాన్సర్‌గా, నా సుదీర్ఘ ప్రొఫెషనల్ ప్రయాణంలో క్రియేటివిటీతో ముడిపడివున్న పనులు ఇప్పటివరకు చాలా చేశాను. వీటిలో చాలావరకు ప్రయోగాలే. నా ఈ నిరంతర ప్రయోగాల నేపథ్యంలో - ఈమధ్య నేను మొదలెట్టిన మరో కొత్త ప్రయోగమే ఈ "మనోహరమ్" డిజిటల్ బులెటిన్.
ఏదో ఒకటో రెండో సినిమాల్ని అన్-లిమిటెడ్‌గా, ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా, పెద్ద టార్గెట్‌తో చేస్తూ, ఈ జర్నీని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కాని, క్రియేటివిటీ కదా... నిర్ణయాలు మారుతుంటాయి. ఇప్పుడు వరుసగా ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ రెండు సినిమాలను ప్రారంభించి, వాటి ప్రి-ప్రొడక్షన్ పనుల బిజీలో తలమునకలై వున్నాను. కొన్నాళ్ళపాటు, పూర్తిస్థాయిలో సినిమాలు చేయబోతున్నాను. ఈ నేపథ్యంలో, మనోహరమ్ లాంటి అదనపు బాధ్యతలకు రెగ్యులర్‌గా సమయం దొరకడం కష్టం. దొరికినా, దీనివల్ల సినిమాలపైన నా డీప్ ఫోకస్ అనేది చెదిరిపోయే ప్రమాదం ఉంటుంది.
సో, ఇక నా మొత్తం ఫోకస్ సినిమాలపైనే పెట్టాలి కాబట్టి, ఏదో ఒకరోజు దీనికి గుడ్‌బై తప్పదు.
కట్ చేస్తే -
స్ట్రెస్ బస్టర్ కోసం ఎక్స్, ఇన్‌స్టా, బ్లాగ్ ఎలాగూ ఉన్నాయి. మనోహరమ్ ద్వారా ఏదైతే సాధించాలని టార్గెట్ చేశానో, దాన్ని నా సోషల్ మీడియా ద్వారా కూడా సాధించగలను అన్నది నా గట్ ఫీలింగ్! కావాలనుకుంటే, బ్లాగింగ్‌కు కూడా కొన్నాళ్ళు విరామం ఇవ్వచ్చునేమో!...
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani