హాలీవుడ్‌ను 'ల్యాండ్ ఆఫ్ డ్రీమ్స్" అంటారు.
అక్కడికి ఏటా కనీసం 100,000 మందికి తక్కువ కాకుండా వస్తారు ఆర్టిస్టులూ టెక్నీషియన్లూ. వాళ్లల్లో కేవలం 1 నుంచి 2 శాతం మందికి మాత్రమే సినిమాల్లో ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. మిగిలినవాళ్లంతా కనీసం ఒక సంవత్సరం నుంచి, కొన్ని దశాబ్దాలపాటు నానా కష్టాలు పడి, వెనక్కివెళ్ళిపోతారు.
ఇలా వెళ్ళిపోయినవాళ్లంతా అదే హాలీవుడ్‌ను 'ల్యాండ్ ఆఫ్ బ్రోకెన్ డ్రీమ్‌స్' అని తిట్టుకుంటారు.
పైనచెప్పిన ఇదే లెక్క ప్రపంచంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు వర్తిస్తుంది. మన బాలీవుడ్, టాలీవుడ్‌లు కూడా అందుకు మినహాయింపు కాదు.
సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా అంతే. ఇకముందు కూడా అంతే.
ఇక్కడ సక్సెస్ అనేది ఎప్పుడూ కేవలం 2 నుంచి 5 శాతం లోపే. ప్రపంచంలోని ఏ సినీ ఇండస్ట్రీలోనయినా, ఏ పీరియడ్‌లోనయినా... ఇండస్ట్రీలోని ప్రతి విభాగంలో, కేవలం వేళ్లమీద లెక్కించగలిగిన ఒక డజన్ మంది మాత్రమే సక్సెస్‌లో ఉంటారు. ఆర్టిస్టులయినా, టెక్నీషియన్లయినా అంతే. మిగిలినవాళ్లంతా పనిలేకుండా ఎదురుచూస్తుండాల్సిందే. లేదంటే, ఏదోవిధంగా వెనుదిరగాల్సిందే.

ప్రొడక్షన్ విషయానికొస్తే, ఒక అంచనా ప్రకారం, సినిమాల సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా 41 శాతం మంది లాభాల్లో ఉంటారు, 59 శాతం మంది నష్టాల్లో ఉంటారు.
అర్టిస్టులయినా, టెక్నీషియన్లయినా, ప్రొడ్యూసర్లయినా, డైరెక్టర్స్ అయినా... ఈ స్టాటిస్టిక్స్‌ను, ఈ వాస్తవాలను గ్రహించినవాళ్లు జాగ్రత్తపడతారు. ఒక అవగాహనతో, కాలిక్యులేటెడ్ రిస్క్‌తో దూకుడుగా ముందుకు దూసుకెళ్తుంటారు.
భయపడేవాళ్ళు, భ్రమల్లో బతికేవాళ్లు మాత్రం సినిమాకష్టాలు పడుతూ అక్కడే కొనసాగుతుంటారు. ఈలోగా జీవితం కొవ్వత్తిలా కరిగిపోతుంది.

కట్ చేస్తే -
ఇండస్ట్రీకి బయట ఉండి, యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌ను నమ్మే అమాయకులకు తెలిసిన ఫిలిం ఇండస్ట్రీ వేరు. నిజమైన ఫిలిం ఇండస్ట్రీ వేరు.
టు బి ఫ్రాంక్, ఫిలిం ఇండస్ట్రీ మంచిదే. దాని సిస్టమ్ దానిది. ఆ సిస్టమ్‌లో ఇమడగలిగినవాడే ఇక్కడ పనికొస్తాడు.
ఇక్కడ టాలెంట్ ఒక్కటే కాదు పనిచేసేది. దాన్ని మించి పనిచేసేవి చాలా ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఒక మూడున్నాయి:

* నెట్‌వర్క్.
* మనీ.
* మానిప్యులేషన్స్.
పైన చెప్పిన మూడింటిలో కనీసం ఏ రెండింటిలోనయినా ఎక్స్‌పర్ట్ అయినవాడు మాత్రమే ఇక్కడ సక్సెస్ సాధిస్తాడు.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani