మనం ఎంతో మంచి ఉద్దేశ్యంతో పరోక్షంగా వారి అప్పటి అవసరానికి సహాయంచేస్తూ ఒక అవకాశం ఇస్తాం. ఆరోజు నిజంగా వారికి అవసరం కదా అని, అప్పటికప్పుడు వాళ్ళు అడిగిందానికి డబుల్ ఇస్తాం.
మాట ప్రకారం మనం ఇచ్చిన పని మరింత ఇంకా వేగంగా చేస్తారు కదా అనుకుంటాం.
కాని, అలా జరగదు.
కట్ చేస్తే -
మనం ప్రయారిటీలో వెనక్కి వెళ్ళిపోతాం. కొత్త కమిట్‌మెంట్స్ పైకొస్తాయి.
మనం ప్రయారిటీలో వెనక్కి వెళ్ళిపోతాం. కొత్త కమిట్‌మెంట్స్ పైకొస్తాయి.
అంతా మర్చిపోతారు. మనం గుర్తుచేస్తేనే స్పందిస్తారు. వాళ్ళేదో మనకు సహాయం చేస్తున్నట్టు ఉంటుంది బిల్డప్. వాళ్ళ ప్రయారిటీలో మనం ఎక్కడికో అడుక్కి వెళ్ళిపోతాం. అసలు ఆ లిస్టులో మనం ఉన్నామా లేదా అన్న డౌట్ కూడా వస్తుంది.
ఇలాంటి ఫేవర్స్ ఇంకా అవసరమా అన్నది బిగ్ కొశ్చన్.
జరిగిన నష్టం చాలు, ఇదొక ఫైనల్ లెస్సన్ అనుకొని ఫ్యూచర్లో కొంచెం వొళ్ళు దగ్గరపెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం బెటర్.
ఫినిషింగ్ టచ్ ఏంటంటే, అది మనకు చేతనైన పని. మన ఫస్ట్ ప్యాషన్. మనం ప్రూవ్ చేసుకున్న ప్రొఫెషన్.
మనకు డబ్బులెక్కువయ్యాయా అన్నట్టుగా, ఆ పని మనం బయటివారికి అవుట్‌సోర్సింగ్ ఇవ్వటం ఏదైతే ఉందో... చివరికి ఇలాంటి బ్లాగులు రాసుకోడానికి కారణమవుతుంది... ఇంకోసారి ఇలాంటి మహాపరాధాలు చెయ్యకుండా!
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani