అమెరికాలో ఒక దివాలా తీసిన వ్యక్తి - సర్వస్వం కోల్పోయి, పీకలదాకా అప్పుల్లో కూరుకుపోయిన స్థితి నుంచి, కేవలం మూడేళ్లలో 600 మిలియన్ల డాలర్లు సంపాదించాడు. అంటే, మన ఇండియన్ కరెన్సీలో సుమారు 5066 కోట్లు అన్నమాట!
"ఇదెలా సాధ్యమయ్యింది?" అని ఆయన్ని ప్రశ్నించినపుడు ఆ రహస్యాన్ని ఆయన కేవలం ఒకే ఒక్క వాక్యంలో చెప్పాడు - "నేను ఎప్పటినుంచయితే భారీ స్థాయిలో ఆలోచించటం మొదలెట్టానో, ఆ క్షణం నుంచే నా జీవితం పూర్తిగా మారిపోయింది!"
ఆ తర్వాత ఆ వ్యక్తి ఇంకెన్నో వందల కోట్లు సంపాదించాడు. క్రమంగా ఒక మిలియనేర్ ట్రెయినర్ గా మారిపోయి, ఆ రంగంలోనూ కోట్లు సంపాదించాడు. అతనే బ్రయాన్ ట్రేసీ. ఇదంతా కొన్ని దశాబ్దాల క్రిందటి విషయం. ఇలాంటి విజయాలు మన దేశంలో కూడా వందలకొద్దీ రికార్డ్ అయి ఉన్నాయి.
ఇక్కడ భారీ స్థాయిలో ఆలోచించడం అంటే "థింకింగ్ బిగ్" అన్న మాట. సక్సెస్ సైన్స్ కు సంబంధించి ఈ రెండు పదాలకి చాలా అర్థం ఉంది. ఇంట్లో ముసుగుతన్ని పడుకొని, పగటి కలలు కనడం, ఆకాశానికి నిచ్చెనలు వేయడం "థింక్ బిగ్" ఎప్పుడూ కాదు.
క్యాలిక్యులేటెడ్ రిస్క్ తో అతిపెద్ద లక్ష్యాల్ని నిర్దేశించుకొని, సంపూర్ణ సామర్థ్యంతో కృషి చేయడమే క్లుప్తంగా దీని నిర్వచనం.
క్యాలిక్యులేటెడ్ రిస్క్ తో అతిపెద్ద లక్ష్యాల్ని నిర్దేశించుకొని, సంపూర్ణ సామర్థ్యంతో కృషి చేయడమే క్లుప్తంగా దీని నిర్వచనం.
కట్ చేస్తే -
సినిమాల్లో అవకాశాల కోసం, గతంలో లాగా దశాబ్దాల పాటు వెతుక్కుంటూ సమయం వృధాచేసుకునే కాలం కాదిది.
ఇది డిజిటల్-సోషల్ మీడియా యుగం.
సరిగ్గా ప్లాన్ చేసుకుని, ఒక బ్లూప్రింట్‌తో కష్టపడితే ఏదీ అసాధ్యం కాదు. ఎన్నో రంగాల్లో, ఎందరో, ఎన్నెన్నో భారీ విజయాల్ని ఇలా సాధించి చూపిస్తున్నారు. యాక్టింగ్ రాదు అని ట్రోల్స్ చేయబడ్డ ఒక వర్ధమాన హీరో ఒకే ఒక్క శుక్రవారం తన జాతకం తానే మార్చేసుకుని, ఇప్పుడు పది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
ఇది సినిమాల్లో మాత్రమే సాధ్యం.

సో, జర్నీకి కొంత టైమ్ పట్టొచ్చు. కాని, లక్ష్యం ఎప్పుడూ పెద్దదిగానే ఉండాలి.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani