కమర్షియల్ సినిమానా, కాన్స్‌కు వెళ్లే సినిమానా... ఇది కాదు ప్రశ్న. నీకెంత ఫ్రీడమ్ ఉంది? నువ్వేం చేయగలుగుతున్నావు అన్నదే అసలు ప్రశ్న.
తను అనుకున్న జీవనశైలిని సృష్టించుకోడాన్ని మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. అది బిచ్చగాడయినా ఒకటే. బిలియనేర్ అయినా ఒకటే. ఎవడి పిచ్చి వాడికానందం.
మరోవిధంగా చెప్పాలంటే - అది సినిమానా, పుస్తకాలా, పెయింటింగా, ఇంకొకటా అన్నది కూడా కాదు ప్రశ్న. నువ్వు చేస్తున్నపనిలో నీకెంత ఆనందం ఉంది అన్నదే అసలు ప్రశ్న.
ఆ ఆనందమే స్వేఛ్చ. ఆ స్వేఛ్చకోసమే అన్వేషణ.
అది నేనయినా, నువ్వయినా, ఎవరయినా.
ఇంగ్లిష్‌లో ఓ సామెత ఉంది... "మైండ్ చేంజెస్ లైక్ వెదర్!" అని. ఇప్పుడు నేను మళ్లీ ఒక రెండేళ్ళో, మూడేళ్ళో వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాను. వాటిలో మొదటి సినిమా మొన్న లాంచ్ చేశాము. నవంబర్ చివర్లో ప్రారంభమై, ఏకధాటిగా ఒకే షెడ్యూల్లో షూటింగ్ పూర్తిచేసుకుంటుంది.
ఇంతకుముందులా ఇప్పుడు సినిమాలంటే ప్యాషన్ ఒక్కటే కాదు. ఒక క్రియేటివ్ వ్యాపకం. ఒక పాష్ ప్రొఫెషన్. ఒక ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ ప్లాట్‌ఫామ్.
అనవసరంగా ఇంత మంచి ప్లాట్‌ఫామ్‌ను చాలా అశ్రధ్ధ చేశాను. అసలు పట్టించుకోలేదు. ఎవరో ఏదో అనుకుంటారనో, లేదంటే మనం చేసే ఒక పని, మనమే చేసే ఇంకోపనిమీద వ్యతిరేక ప్రభావం చూపిస్తుందనో అనుకోవడం ఉట్టి అవివేకం. దేని దారి దానిదే.

మన గురించి అనుకునేవాళ్లెవరూ మన ఫోన్ బిల్స్ కట్టరు, మన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయరు. అవసరంలో మనల్ని ఆదుకోరు. అలాంటి ఎవరో ఏదో అనుకుంటారని మనం అనుకోవడం పెద్ద ఫూలిష్‌నెస్. ఈ యాంగిల్లో చూసినప్పుడు, అనవసరంగా మనల్ని మనమే అణగతొక్కేసుకుంటున్నామన్నమాట!
అదొక పనికిరాని మైండ్‌సెట్. జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో మనకు అడుగడుగునా అడ్డుపడే మైండ్‌సెట్. జీవితంలో ఆనందాన్ని అనుభవించనివ్వని మైండ్‌సెట్.
అదొక పనికిరాని మైండ్‌సెట్. జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో మనకు అడుగడుగునా అడ్డుపడే మైండ్‌సెట్. జీవితంలో ఆనందాన్ని అనుభవించనివ్వని మైండ్‌సెట్.
కట్ చేస్తే -
సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్ కూడా.
ఇండస్ట్రీలో సక్సెస్ స్టోరీలనే ఆదర్శంగా తీసుకో. ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకో. నెగెటివ్ మనుషులు, నెగెటివ్ వాతావరణం నీ చుట్టూ లేకుండా చూసుకో. ఖర్మకొద్దీ మనచుట్టూ ఎక్కువగా ఉండేది వాళ్ళే. ఎప్పటికప్పుడు ఫిల్టర్ వేసి చూసుకో.
అండ్, ఫైనల్లీ... చిన్న సినిమానా, పెద్ద సినిమానా అన్నది అసలు ఆలోచించకు. ఎప్పుడూ ఒక సినిమా చేస్తుండటం ముఖ్యం. ట్రాక్ మీదుండటం ముఖ్యం, లైమ్‌లైట్‌లో ఉండటం ముఖ్యం.
ఇదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది.

- మనోహర్ చిమ్మని
Agree —Kiran is a good actor —Telugu cinema dominated by 4 families —they control everything —varasathva rajakiyam —anr /ntr dominated once -now Chirurg .pavan -balaiah -Arvin’d—nagarjuna-Dilraj.—why /how long ?
ReplyDelete"నువ్వు చేస్తున్నపనిలో నీకెంత ఆనందం ఉంది అన్నదే అసలు ప్రశ్న."
ReplyDeleteExactly