"నా సమయం నా చేతుల్లో ఉంది. నాకు కావల్సినంత నేను సంపాదించుకున్నాను. నా జీవితం నా ఇష్టం. ఇంకొకరి నుంచి ఏదీ ఆశించే అవసరం నాకు లేదు. నన్ను ఎవ్వరూ కొశ్చన్ చేసే ధైర్యం చెయ్యలేరు."
ఎంత కాన్‌ఫిడెన్స్!
ఎవ్వరైనా ఈ మాటలు వింటే ఇన్‌స్పయిర్ కావల్సిందే. ఇదే కదా జీవితంలో ఎవ్వరైనా సాధించాలనుకునేది? దీనికోసమే కదా దశాబ్దాల ఉరుకులు పరుగులు?
కాని, ఆమె సాధించింది.
అది కూడా ఒక ఒంటరి మహిళగా.
సింగిల్ పేరెంట్‌గా.
ఆమె ఇద్దరు పిల్లలు రెండు విభిన్న ప్రొఫెషన్స్‌లో మంచి పొజిషన్‌లో హాప్పీగా ఉన్నారు.
పిల్లల్ని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దటం ఆమె సాధించిన ఇంకో పెద్ద ఆస్తి.
కట్ చేస్తే -
నాణేనికి ఇంకో వైపు...
చిన్న వయసులోనే పెళ్ళి. భర్త క్యాన్సర్‌తో పోయారు. ఇద్దరు పిల్లలు, బ్యాగులో రెండు వేల రూపాయలతో హైద్రాబాద్ వచ్చిందామె.
చిన్న ప్రూఫ్ రీడింగ్ ఉద్యోగంతో ప్రారంభించింది. ఆ తర్వాత ఏ సంస్థలో అయితే తను ఉద్యోగిగా చేరిందో, ఆ సంస్థనే కొనుక్కునే స్థాయికి ఎదిగింది. స్థిరాస్థులు సంపాదించుకొంది. ఒక కోటీశ్వరురాలుగా ఇప్పుడు ఏ పనీ లేకుండా రిలాక్స్ అవుతోంది.
ఇదంతా చాలా సులువుగా రాయడానికీ చదవడానికీ బానే ఉంటుంది. సాధించడం అంత తేలిక కాదు. బయటికి తెలియని ఒంటరితనపు విషాదం కూడా ఎంతో ఉంటుంది. కాని, అవన్నీ ఆమె తట్టుకుంది. జయించింది.
నాకు తెలిసిన సర్కిల్స్‌లో ఈ స్థాయి సక్సెస్ సాధించిన మహిళలెవ్వరినీ నేను చూడలేదు.
ఆమె ఒక ఇన్‌స్పిరేషన్.
మంచి కవిత్వం కూడా రాస్తుంది. పబ్లిష్ చేసుకోడానికి ఇష్టపడదు. కాని, బుక్ వేసే ఆలోచన ఉంది.
ఆమె పేరు ఒక ప్రఖ్యాత హిందీ నటి పేరు.
Life is not served on a golden plate. It is full of ups and downs, yet the true strength lies in rising above them. For a single woman, the journey is even tougher in our society—but the few who conquer it become the real heroines of life.
- మనోహర్ చిమ్మని