సినిమాల్లో పనిచేస్తూ, సినిమాల్లో కోట్లు ఖర్చుపెట్టేవాళ్ళకు, కోట్లు పోగొట్టుకొని రోడ్డునపడేవాళ్ళకు తెలుస్తాయి నిజానిజాలు. నాలుగు గోడల మధ్య కూర్చుని, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని జడ్‌మెంట్లు ఇచ్చేవాళ్లకు ఏం తెలుస్తుంది?
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఎన్నెన్నో మార్పులను అధ్యయనం చెయ్యాలి. అప్‌డేట్ అవ్వాలి.
సినిమా ప్రమోషన్ గురించి నిన్న నేను రాసిన ఒక పోస్టుకు ఇండస్ట్రీ మిత్రుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఎవరో ఒకరిద్దరు సినిమా బిజినెస్‌తో సంబంధం లేని మిత్రులకు మాత్రం నా పోస్ట్ చాలా కష్టం కలిగించినట్టుంది.
అటూఇటూ తిప్పి ఏదేదో రాసి ఆనందపడుతూ, చివరికి నేను చెప్పిన పాయింట్సే వాళ్ళూ చెప్పారన్నది గమనించి నవ్వుకోవడం తప్ప ఏం చేయగలం?
ఈ అనవసరమైన ఖర్చంతా కూడా చివరికి ప్రేక్షకుని మీదనే మీదనే పడుతుందన్నది కామన్ సెన్స్.
కట్ చేస్తే -
సినిమా ప్రమోషన్ అంటూ రకరకాల ఇంటర్వ్యూలు, చాట్స్, ప్రొగ్రాములు చేస్తూ ప్రేక్షకులకు ఇస్తున్న ఎంటర్‌టైన్మెంటుని వాళ్ళు నిజంగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
కాని, ప్రమాదం అక్కడే ఉంది.
ఇదంతా సినిమా మీద ఆసక్తిని డైల్యూట్ చేస్తుంది.
టీజర్, ట్రయలర్లు ఇచ్చిన ఎఫెక్టు ఏ మూలకో పోతోంది.
టీజర్, ట్రయలర్లు ఇచ్చిన ఎఫెక్టు ఏ మూలకో పోతోంది.
ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్, హీరోహీరోయిన్స్... వీళ్లందరి వ్యక్తిగత విషయాలు, ఆసక్తులు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ మధ్య సంబంధాలు... ఇలా ఏవేవో ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ షిఫ్ట్‌లో అసలు 'సినిమా మీద ఆసక్తి' అనేది ప్రయారిటీలో ఎక్కడో అడుక్కుపోతోంది.
నిజంగా ఇలాంటి ప్రమోషన్‌ను ఎంజాయ్ చేస్తున్నవారందరిలో కనీసం 5% మంది అయినా సినిమాకు వెళ్తున్నారా అన్నది బిగ్ కొశ్చన్.
నిజంగా అలా వెళ్తే గనుక, ప్రతి సినిమా హిట్టే.
కాని అలా జరగదు.
ఎందుకంటే, "మనిషి జీవనశైలే మారిపోయింది. థియేటర్‌కు వెళ్ళి సినిమా చూడటం అనేది ఇప్పుడు ఒక అవుట్‌డేటెడ్ కాన్సెప్ట్ అన్న నిజాన్ని హాలీవుడ్ తెలుసుకోవాలి" అని నెట్‌ఫ్లిక్స్ సీఈవో Ted Sarandos ఈమధ్యనే అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani