Thursday, 21 May 2026

"ఉజ్వల" జ్ఞాపకాలు


ఉస్మానియా యూనివర్సిటీ 'లా' హాస్టల్లో ఉన్నప్పుడే గుడిపాటి ఎడిటర్‌గా "ఉజ్వల" మంత్లీ మ్యాగజైన్ పబ్లిష్ చేస్తుండేవాడు.  

ఎమ్మే తర్వాత, అప్పుడు నేను ఓయూ ఆర్ట్స్ కాలేజీలోనే ఎమ్మెల్ఐయస్సీ చదువుతున్నాను. ఓయూలోనే మూడేళ్ళ పార్ట్-టైమ్ రష్యన్ డిప్లొమా కూడా చేస్తుండేవాణ్ణి. విద్యార్థిగా ఉన్నప్పుడే నేను నేరుగా రష్యన్ భాషలోంచి తెలుగులోకి అనువదించిన కథలు అప్పట్లో విపుల, ఆంధ్రజ్యోతి వీక్లీ వంటి పత్రికల్లో అచ్చయ్యాయి.  

గుడిపాటి "ఉజ్వల" కోసం కూడా అప్పుడు నేనొక రష్యన్ కథ అనువదించి ఇచ్చాను. 

అదే "మంచు".

రచయిత కాన్‌స్టంటీన్ పవుస్తోవ్‌స్కీ. చాలా మంచి కథ. 

కథా సంకలనాలు వెయ్యాలని మొట్టమొదటిసారిగా మొన్నొకసారి అనిపించింది. గుడిపాటితో చర్చించాను. ఒకేసారి రెండు సంకలనాలు వెయ్యాలని ప్లాన్ చేశాం. 

నిజానికి ఈ అలోచన నాలో రావటానికి ఒక కారణం మా ప్రదీప్. ఆ మధ్య నేను రాసిన ఒక కథ చదివి, "ఇదే పేరుతో మీరు ఒక కథా సంకలనం వేస్తారని నాకు ఎందుకో అనిపిస్తోంది సర్" అన్నాడు.

నా మనసులో నేనూ అదే అనుకుంటున్నాను. ప్రదీప్ నోట్లోంచి వచ్చింది.

ప్రదీప్ చదివిన ఆ కథ పేరు: "సముద్రం నాకిష్టం."


కట్ చేస్తే -

గతంలో అచ్చయిన నా కథలను వెతుకుతోంటే గుడిపాటి "ఉజ్వల" కనిపించింది. అప్పటి మా జ్ఞాపకాలేన్నో గుర్తుకొచ్చాయి.  

నిజం చెప్తున్నాను... రాయడంలో ఉన్న ఆనందం నేను ఇంక దేనిలోనూ ఫీలవ్వలేకపోయాను. సినిమాలు కూడా నాకంత ఆనందాన్ని ఇవ్వలేదు అంటే అతిశయోక్తి కాదు. 

దురదృష్టవశాత్తూ, నాకెంతో ఇష్టమైన రైటింగ్‌నే నేను చాలా అశ్రద్ధ చేశాను. విస్మరించాను.    

నిజానికి రాయాలనుకుంటే ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా రాయగలం. ఏదీ అడ్డం కాదు. అందుకే ఇప్పుడు ఎక్కువగా రాస్తున్నాను. 

రైటింగ్‌ను విస్మరించిన విషయంలో నన్ను చెడామడా వాయించేసిన ఇంకో ఆత్మీయ మిత్రురాలిని కూడా నేను రోజూ తల్చుకుంటుంటాను.  

కుటుంబ బాధ్యతల నుంచి కొంచెం ఫ్రీ అయ్యానిప్పుడు. కొత్తగా మళ్ళీ సినిమాలు చెయ్యాలనుకొంటున్నాను. ఆ ప్రి-ప్రొడక్షన్ పనులు ఒకవైపు జరుగుతున్నాయి. 

అయినా సరే, రచనే నా తొలిప్రేమ. 

Somewhere along the journey, I lost touch with my first love — writing. 
Now I am back.
And suddenly, my heart, my silence, my soul… everything within me has started dancing again.

- మనోహర్ చిమ్మని                

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani