Netflix CEO Ted Sarandos claimed in an interview that audiences are telling Hollywood, "They no longer want to go to the cinema, and would rather watch movies on streaming services."
Citing the recent drop in cinema attendance Ted Sarandos said “What is the consumer telling us? That they’d like to watch movies at home.”
అదీ విషయం.
నెట్‌ఫ్లిక్స్ సీఈవో ఈ మాట అనడం వెనుక ఎంతో అధ్యయనం ఉంటుంది. ఏదో తోచింది అనడానికి ఈయనేదో థర్డ్ గ్రేడ్ క్రిటిక్ కాదు. ఒక పెద్ద ఎంటర్‌టైన్మెంట్ బిజినెస్ సామ్రాజ్యానికి సారథి.
సో, సినిమా థియేటర్లకు ప్రేక్షకుల డ్రాప్ అనేది ఒక్క ఇండియాలోనే కాదు. ప్రపంచమంతా ఉంది.
అన్నిచోట్లా ఇదే మార్పు.
మామూలు ల్యాండ్‌లైన్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్‌కు, మొబైల్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్‌కు ఎలా అయితే మారుతూవచ్చామో, ఇదీ అలాంటిదే.
సాంకేతిక అభివృద్ధి నేపథ్యంగా, ప్రతి కోణంలో, మనిషి జీవనశైలిలో వస్తున్న మార్పును ఎవరైనా సరే ఆహ్వానించక తప్పదు.
కట్ చేస్తే -
ఓటీటీలకు ప్రేక్షకులున్నారు. కంటెంట్ కావల్సినంత ఉంది. వెబ్ సీరీస్‌లు, ఒరిజినల్స్ రూపంలో కొత్త కంటెంట్ వాళ్లే సొంతంగా క్రియేట్ చేసుకొంటున్నారు. సినిమాలు వాళ్లకిప్పుడు ఒక ఆప్షన్ మాత్రమే.
అంతకుముందు థియేటర్‌కు వెళ్ళి సినిమా చూడటం ఒక్కటే సగటు కట్ చేస్తే -
ఓటీటీలకు ప్రేక్షకులున్నారు. కంటెంట్ కావల్సినంత ఉంది. వెబ్ సీరీస్‌లు, ఒరిజినల్స్ రూపంలో కొత్త కంటెంట్ వాళ్లే సొంతంగా క్రియేట్ చేసుకొంటున్నారు.
సినిమాలు వాళ్లకిప్పుడు ఒక ఆప్షన్ మాత్రమే.
మరోవైపు, అంతకుముందు థియేటర్‌కు వెళ్ళి సినిమా చూడటం ఒక్కటే సగటు మనిషికి నంబర్ వన్ వినోదసాధనంగా ఉండేది. ఇప్పుడు మాల్స్, ఫుడ్ కోర్టులు, లాంగ్ డ్రైవ్‌లు, విహార యాత్రలు, రిసార్ట్స్, పబ్బులు, క్లబ్బులు... ఇలా చాలా చాలా ఎంటర్‌టైన్మెంట్స్ అలవాటులోకి వచ్చాయి. వీటన్నిటి ముందు అసలు సినిమా చూడ్డం అనేది ప్రాధాన్యతా క్రమంలో అడుక్కి వెళ్ళింది.
అది థియేటర్లోనా, ఓటీటీలోనా అన్నది తర్వాత విషయం. కొంతమంది పెద్ద హీరోల ఫ్యాన్స్‌కు తప్ప, అసలు సినిమా చూడ్డం అనేది ప్రయారిటీలోంచి మరింతగా కిందకి దిగిపోతోంది.
బహుశా మీరూ గమనించే ఉంటారు... ఏదో పాజిటివ్ టాక్ వచ్చిన ఒకటిరెండు సినిమాలకు తప్ప, దాదాపు థియేటర్స్ అన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే క్రమంగా అంతరించిపోతున్నాయి.
బహుశా మీరూ గమనించే ఉంటారు... ఏదో పాజిటివ్ టాక్ వచ్చిన ఒకటిరెండు సినిమాలకు తప్ప, దాదాపు థియేటర్స్ అన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే క్రమంగా అంతరించిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో - భారీ బడ్జెట్ సినిమాలు, ప్యానిండియా సినిమాలు తీయడం అనేది తెలిసి ఆడే ఒక పెద్ద గ్యాంబ్లింగ్ అయిపోయింది.
5 శాతం లోపే సక్సెస్ రేట్ ఉన్నచోట, వందల కోట్లు పెట్టి భారీ సినిమాలు తీయడం కరెక్టా? కథే హీరోగా చిన్న బడ్జెట్లో సినిమాలు తీయడం కరెక్టా?
దేనికి రిస్క్ ఎక్కువ?
ఏది రిస్క్-ఫ్రీ?
వందల కోట్లు పెట్టి తీసే సినిమాల లెక్కలు తప్పుతాయి. పరిమిత బడ్జెట్‌లో నిర్మితమయ్యే ఇండిపెండెంట్ సినిమాలకు లెక్కలు తప్పినా పెద్ద ఫరక్ పడదు.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani