సినిమాను ఒక పక్కా బిజినెస్‌గా, ఒక ప్రొఫెషన్‌గా మాత్రమే తీసుకొని, ఆ పరిధిలోనే కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు, నియమాలు పాటిస్తే ఎలాంటి నష్టం ఉండదు. ఏ కష్టాలూ రావు. బాగా సంపాదించొచ్చు కూడా.
స్పిరిచువల్‌గా చెప్పాలంటే, ఒక రకమైన 'డిటాచ్‌డ్ అటాచ్‌మెంట్.'
అయితే ఇది చెప్పినంత సులభం కాదు. అందరివల్ల కూడా కాదు.
ఎందుకంటే క్రియేటివిటీ వేరు, బిజినెస్ వేరు.
ఎందుకంటే క్రియేటివిటీ వేరు, బిజినెస్ వేరు.
99 శాతం మంది టెంప్ట్ అవుతారు. అక్కడే సమస్య.
కట్ చేస్తే -
అన్ని బిజినెస్‌లలో లాగే ఫిలిమ్మేకింగ్‌లో కూడా అన్నీ మన కంట్రోల్లో ఉన్నట్టే ఉంటుంది. అంతే. టెంప్ట్ అయిపోతాం. అన్నీ మనకు తెలుసుకదా అనుకుంటాం. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ముందుకు ఉరుకుతాం.
పడాల్సిన దెబ్బ పడుతుంది.
ఇది ఒక్క మనీ మ్యాటర్స్ విషయంలోనే కాదు. ఊహించని ఇంకేదో విషయంలో ఏదో అడ్దంకి వస్తుంది. స్టకప్ అయిపోతాం. ఆ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ నార్మల్ ట్రాక్ మీదకి రావడం అంత ఈజీ కాదు.
అందుకే... అది ప్రొఫెషన్ అయినా, బిజినెస్ అయినా, పర్సనల్ విషయం అయినా సరే... టెంప్ట్ కావద్దు.
కాని, అవుతాం.
అదే జీవితం.
సో... క్రియేటివిటీ వేరు, బిజినెస్ వేరు.
క్రియేటివ్ బిజినెస్ వేరు.
ఈ బేసిక్ పాయింట్ రియలైజ్ కావడానికి మాత్రం తాతలు దిగొస్తారు. ఈలోగా జరక్కూడని నష్టం జరిగిపోతుంది.
సో... క్రియేటివిటీ వేరు, బిజినెస్ వేరు.
క్రియేటివ్ బిజినెస్ వేరు.
ఈ బేసిక్ పాయింట్ రియలైజ్ కావడానికి మాత్రం తాతలు దిగొస్తారు. ఈలోగా జరక్కూడని నష్టం జరిగిపోతుంది.
అయినా సరే, ఇది పక్కా బిజినెస్ అన్నది ఒకసారి సంపూర్ణంగా రియలైజ్ అవగలిగితే చాలు. ఇంక మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani