మన నిర్ణయం కావచ్చు.
మన చేస్తున్న పని కావచ్చు.
మన సాంఘిక స్పృహ కావచ్చు.
ఈ ఒక్కటే అని గిరి గీసుకొని కూర్చోలేం.
ఇది వద్దు అని కూడా ఖచ్చితంగా అనుకోలేం.
ఇది వద్దు అని కూడా ఖచ్చితంగా అనుకోలేం.
సినిమాలా ఇంకొకటా అన్నది అసలు ప్రశ్నే కాదు.
పని చేసుకుంటూ ఉండటం ముఖ్యం.
ఏది ఎప్పటివరకు అనేది నిర్ణయించేది కాలం.
దాని గురించి నీ నిరంతర ఆలోచన, సంఘర్షణ అనవసరం. వ్యర్థం.
వాతావరణంలా మనసు మారుతుంటుంది.
మన ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతుంటాయి.
మనం మనుషులం.
ఇది సహజం.
కట్ చేస్తే -
ఒక మనిషి మీదనో, ఒక పరిస్థితి మీదనో, మనకు లేని ఒక అంశం మీదనో నిందవేస్తూ, బ్లేమ్ గేమ్ ఆడటం మన సమస్యల్ని తీర్చదు.
అది ఉంటే ఇది చేసేవాణ్ణి అనుకోవడమంత మూర్ఖత్వం లేదు.
అన్నిటికీ "నేనే కారణం" అన్న బాధ్యత స్వీకరించగలిగినప్పుడు క్రమంగా అంతా బాగుంటుంది. కాని, ఇందుకు మన ఈగో ఒప్పుకోదు.
అయినా సరే, మనకున్న సమయం తక్కువ.
ఈ నిజం ముందు ఏ ఈగోలకూ విలువ లేదు.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani