Wednesday, 20 May 2026

A Beautiful Antique Blessing from Our Russian Professor


1961 లో మా రష్యన్ ప్రొఫెసర్ మురుంకర్ సార్‌కు, మాస్కోలో వాళ్ళ ప్రొఫెసర్ గిఫ్ట్ ఇచ్చారట ఈ ప్రొజెక్టర్. 
 
రష్యన్ మేడ్. 

ఇదే ప్రొజెక్టర్‌తో మా మురుంకర్ సార్ 1987-89 వరకు ఉస్మానియా యూనివర్సిటీ రష్యన్ డిపార్ట్‌మెంట్‌లో మాకు రష్యన్ బోధించారు.  


కట్ టూ 2026 - 

ఇవ్వాళ ఉదయం, నన్ను పిలిచి ఈ ప్రొజెక్టర్‌ను నాకు గిఫ్ట్ ఇచ్చారు మా సార్. 

"నువ్వే రైట్ పర్సన్, మనోహర్. దీన్ని నువ్వు మీ ఆఫీసులో ఒక డెకరేటివ్ పీస్‌గా పెట్టుకో" అన్నారు. 

మేడమ్‌తో కలిసి ఎల్లుండి అమెరికా వెళ్తున్న మా సార్‌కు పాదాభివందనం చేసి వచ్చాను. 

Love you, sir.
Wishing you a happy journey and a wonderful trip.

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani